HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >10 Bjp Mps Including 2 Ministers Resign From Parliament After Assembly Poll Win

BJP MPs Resign : 10 మంది బీజేపీ ఎంపీల రాజీనామా.. ఎందుకు ?

BJP MPs Resign : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బుధవారం రాజీనామా చేశారు.

  • By Pasha Published Date - 03:47 PM, Wed - 6 December 23
  • daily-hunt
BJP
Bjp Another 6

BJP MPs Resign : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.  వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అనంతరం బీజేపీ చీఫ్ నడ్డా వారితో పాటు స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తొమ్మిది మంది ఎంపీలు రాజీనామాలను సమర్పించారు.  ఎంపీ కిరోరి లాల్ మీనా తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. అయితే రాజీనామా చేసిన 10 మంది ఎంపీలలో మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్, రితీ పాఠక్ ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి, కిరోరి లాల్ మీనా (రాజ్యసభ ఎంపీ) రాజీనామా చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అరుణ్ సావో, గోమతి సాయి రాజీనామా లేఖలు సమర్పించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బాబా బాలక్‌నాథ్‌, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి గెలిచిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్‌ ఇంకా రాజీనామాలు సమర్పించలేదు.

Also Read: Kamala Harris : 200 ఏళ్ల కిందటి రికార్డును బద్దలుకొట్టిన కమలా హ్యారిస్

ఇప్పటివరకు నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, ప్రహ్లాద్ పటేల్ కేంద్ర ఆహార ప్రాసెసింగ్, జలశక్తి శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు.  రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసిన కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గెలవలేకపోయారు. ఖాళీ అయిన మంత్రి పదవుల భర్తీ కోసం త్వరలోనే  కేంద్ర మంత్రివర్గ పునర్విభజన జరిగే అవకాశం ఉందని(BJP MPs Resign) అంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 Ministers Resign
  • Assembly Win
  • BJP MPs Resign
  • parliament

Related News

    Latest News

    • Suryakumar Yadav : ఆస్ట్రేలియాపై రివేంజ్..టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌‌ ప్రత్యర్థిపై సూర్య రిప్లయ్!

    • Telangana Global Summit : పెట్టుబడులకు కేరాఫ్‌గా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ – సీఎం రేవంత్

    • Superintendent : సినిమా సీన్ రిపీట్..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మారువేషంలో!

    • Jagan – Lokesh : జగన్ కు లోకేష్ కు తేడా ఇదే..దటీజ్ లోకేష్ అన్న !!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    Trending News

      • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

      • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

      • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

      • Baba Vanga: భ‌య‌పెడుతున్న బాబా వంగా భవిష్యవాణి!

      • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd