HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Why Guava Is A Must Have For Daily Diet

Guava Health Benefits: ఏంటి.. ఒక్క జామ పండుతో ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?

జామ పండు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Author : Anshu Date : 24-02-2025 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Guava Health Benefits
Guava Health Benefits

జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ లో ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందట. ఇది శరీరానికి ఉన్న రక్షణ శక్తిని పెంచుతుందట. ఆరెంజ్ లోని విటమిన్ సి కంటే జామలో నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందట. అలాగే జామ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించే ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటిగా ఉందని చెబుతున్నారు.

జామ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ ఆరోగ్యానికి సహాయపడుతుందట. ఇది జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందట. డయాబెటిస్ ఉన్నవారికి జామపండు ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు. కాగా జామ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుందట. అలాగే కంటి సమస్యలను దూరంగా ఉంచుతుందట. వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గే సమస్యను నివారించేందుకు జామ జ్యూస్ ఎంతో బాగా ఉపయోగపడుతుందట.

అలాగే జామలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. జామలో ఉన్న పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయట. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి రోజూ ఒక జామ పండు తింటే సరిపోతుందని, ఒక జామ పండులో, ఒక అరటిపండులో సమానమైన పొటాషియం ఉంటుందని చెబుతున్నారు. జామలో సమృద్ధిగా ఉండే మాంగనీస్, ఆహారం నుంచి ఇతర ముఖ్యమైన పోషకాలను శరీరం బాగా గ్రహించేందుకు సహాయపడుతుందట. జామలో  ఉండే మరో ముఖ్యమైన ప్రయోజనం ఫోలేట్ అనే ఖనిజం గర్భధారణకు సహాయపడుతుందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • guava
  • Guava benefits
  • Guava Health Benefits
  • health benefits

Related News

Treating Breast Cancer with Bee Venom?

Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య. అందులోనూ రొమ్ము క్యాన్సర్ ఎందరినో వేధిస్తోంది. ఈ క్యాన్సర్ రక్కసి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్యాన్సర్ను నివారించేందుకు ఎన్నో రకాల ఔషధాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ దశను బట్టి చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ను మాన్పించడానికి తేనెటీగలు ఉపయోగపడ

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd