Tamarind: చింతపండు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
చింతపండు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:34 AM, Sun - 20 October 24

భారతీయుల వంట గదిలో ఉండే వాటిలో చింతపండు తప్పనిసరి. ప్రతి ఒక్కరి వంట గదిలో చింతపండు తప్పనిసరిగా ఉంటుంది. ఈ చింతపండును ఎన్నో రకాల కూరల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. చింతపండు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. చింతపండు వల్ల అనేక లాభాలు కూడా ఉన్నాయి. అలా అని చింత పండు ఎక్కువగా తినడం అసలు మంచిది కాదు. కొందరు కూరల్లో అలాగే మిగతా వాటిలో చింతపండును ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మరి చింతపండు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చింతపండులో టార్టారిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్, పెక్టిన్, టానిన్లు, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్లు ఉంటాయి. అయితే రోజు 10 గ్రాముల చింతపండు తీసుకోవడం సురక్షితం అని చెప్తున్నారు. ఇంతకన్నా తక్కువ పరిమాణంలో తీసుకున్నా మంచిదేనట. చింతపండు ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల యొక్క నిర్మాణం దెబ్బతింటుందట. అదేవిధంగా పళ్ళ పై ఉండే ఎనామిలో దెబ్బతిని పళ్ళు బలహీనంగా మారతాయని చెబుతున్నారు. చింతపండులో టానిన్ లతో సహా అనేక సమ్మేళనాలు ఉంటాయి. వీటిని జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టం.
అధిక పరిమాణంలో చింతపండు తీసుకుంటే, కడుపు, జీర్ణశయాంతర ప్రేగులలో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇది గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర కడుపు సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. చింతపండును అధిక మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయట. మైకం, బలహీనత ఆవహిస్తాయి. గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఇప్పటికే మందులు వాడుతున్న వారు చింతపండు తీసుకోవడం అంతమంచిది కాదు.
అలాగే గర్భధారణ సమయంలో చింతపండుకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు చింతపండు ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదట. దీన్ని ఎక్కువగా తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుపై ప్రభావం చూపుతుందట. అంతేకాదు పాలిచ్చే తల్లులు కూడా చింతపండు తినకూడదని చెబుతున్నారు. చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.