HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Who Should Not Eat Raw Mango

Raw Mango: పొరపాటున కూడా వీరు పచ్చి మామిడికాయ అస్సలు తినకూడదట.. తిన్నారో అంతే సంగతులు

పచ్చి మామిడికాయ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు పచ్చి మామిడికాయను తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 07-05-2025 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raw Mango
Raw Mango

వేసవికాలంలో వచ్చింది అంటే చాలు అందరికీ ఇష్టమైన మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. వీటి కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. మామిడి పండ్లను కొందరు పచ్చిగా తింటే మరికొందరు బాగా మాగిన మామిడి పండుని తింటూ ఉంటారు. అయితే మామిడి పండ్లు తినడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మామిడి పండుకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా మామిడిపండు మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు.

అలాగే బయట నుంచి తెచ్చిన మామిడి పండ్లను కనీసం నీటిలో అరగంటసేపు అయినా ఉంచి ఆ తర్వాత తినడం మంచిదని చెబుతున్నారు. పచ్చి మామిడిపండు ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణ వ్యక్తులు పచ్చి మామిడి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. దీంతో, సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది.కానీ ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడి తినకూడదట. పచ్చి మామిడి తినడం వల్ల మీ సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంటుందట. ఎందుకంటే ఇది పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. దీంతో జలుబు, దగ్గు తీవ్రం అవ్వడంతో పాటు గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

అలాగే పంటి నొప్పితో బాధపడుతున్న వారు పచ్చి మామిడికాయ తినకూడదట. పచ్చి మామిడి తినడం వల్ల పంటి నొప్పి ఇంకా తీవ్రమవుతుంది. పంటి నొప్పి, సెన్పిటివిటీ, జలదరింపు వంటి వాటితో బాధపడేవారు పచ్చి మామిడి తినడం వల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలు అనగా అజిర్తి, కడుపునొప్పి,ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు పచ్చి మామిడికాయకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. పచ్చి మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో, దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి ఇంకా తీవ్రమవుతుందట. అంతేకాకుండా అతిసారం వచ్చే ప్రమాదం కూడా ఉందట. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, తిమ్మిర్లు, గ్యాస్ వంటి మొదలైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని,అందుకే జీర్ణసమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా పచ్చి మామిడికాయ తినకపోవడం మంచిదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating Raw Mango
  • health tips
  • raw mango
  • raw mango benefits

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

    • అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

    • రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

    Trending News

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

      • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd