Coconut Water: ఉదయం లేక మధ్యాహ్నం.. కొబ్బరి నీరు ఎప్పుడు తాగితే మంచిది తెలుసా?
కొబ్బరి నీరు తాగే వాళ్ళు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి నిర్దిష్ట సమయంలో మాత్రమే తాగాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Thu - 15 August 24

కొబ్బరినీరు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్యం బాగో లేనప్పుడు కొబ్బరి నీటిని తాగాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో ఈ కొబ్బరి నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. వేడి తగ్గించడానికి ఈ మండే ఎండల్లో కొబ్బరి నీరు తాగడం అనేది చాలా అసవరం. కాగా కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో తాగకూడదని అంటున్నారు. మరి కొబ్బరి నీటిని ఎప్పుడు తా గాలో, ఏ సమయంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు కేవలం ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల బరువు నిర్వహణ, చర్మ హైడ్రేషన్‌ను మెరుగుపరచడం , బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌లను నివారించవచ్చట. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల దీన్ని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. కొబ్బరినీళ్లు తాగాలి అనుకున్న వాళ్లు ఉదయం పూట తాగడం మంచిదని చెబుతున్నారు. సాయంత్రం కంటే ఉదయం తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఒకవేళ సాయంత్రం పూట తాగాల్సి వస్తే కేవలం మితంగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
శరీరం జీవక్రియను ప్రారంభిస్తుంది. అలాగే ఒక అద్భుతమైన సహజ ఎలక్ట్రోలైట్ మూలం, ఇది వ్యాయామం అనంతర రీహైడ్రేషన్‌కు గొప్ప ఎంపిక.
రక్తంలో పొటాషియం ఎక్కువగా ఉంటే కొబ్బరి నీళ్లు తాగవద్దు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ జబ్బులు, గుండె సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదు. కొంతమంది నిద్రపోవడానికి ముందు కొబ్బరి నీటిని తాగుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు. పడుకునే ముందు కొబ్బరి నీరు తాగితే అది నిద్రకు ఆటంకం కలిగిస్తుందట. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన ఎంపిక అయినప్పటికీ, సహజ చక్కెర కంటెంట్ కారణంగా మితంగా తాగడం కూడా చాలా ముఖ్యం, పోషకాహార నిపుణులు అంటున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.