Bombay Blood Group: బాంబే బ్లడ్ గ్రూప్ గురించి తెలుసా?
Bombay Blood Group : నాలుగు బ్లడ్ గ్రూప్స్ మనకు తెలుసు.. A, B, AB, O బ్లడ్ గ్రూప్స్ అందరికీ పరిచయం.. ఇవే కాకుండా బాంబే బ్లడ్ గ్రూప్ కూడా ఉంది.. అదేమిటి ? మిగితా నాలుగు బ్లడ్ గ్రూప్స్ కు బాంబే బ్లడ్ గ్రూప్ కు తేడా ఏమిటి ?
- Author : Pasha
Date : 14-06-2023 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
Bombay Blood Group : నాలుగు బ్లడ్ గ్రూప్స్ మనకు తెలుసు..
A, B, AB, O బ్లడ్ గ్రూప్స్ అందరికీ పరిచయం..
ఇవే కాకుండా బాంబే బ్లడ్ గ్రూప్ కూడా ఉంది.. అదేమిటి ?
మిగితా నాలుగు బ్లడ్ గ్రూప్స్ కు బాంబే బ్లడ్ గ్రూప్ కు తేడా ఏమిటి ?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 2.50 లక్షల మందిలో ఒకరికే బాంబే బ్లడ్ గ్రూప్ ఉంది. మనదేశంలో పుట్టే ప్రతి 10,000 మందిలో ఒకరే బాంబే బ్లడ్ గ్రూప్ ను కలిగి ఉంటున్నారు. అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్‌ను 1952లో డాక్టర్ YM భండే తొలిసారిగా ముంబైలో కనుగొన్నారు. బాంబే బ్లడ్ గ్రూప్ ను.. hh బ్లడ్ గ్రూప్ (Bombay Blood Group) అని కూడా పిలుస్తారు.ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు మనదేశంలో ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ ఒక తరం నుంచి మరో తరానికి వంశపారంపర్యంగా వస్తోంది. H యాంటీజెన్ అనేది మనిషి శరీరంలోని 19వ క్రోమోజోమ్ లో ఉంటుంది.
Also read : Blood Group Diet : O, A, B, AB బ్లడ్ టైప్ ఆధారంగా ఆహారం
O బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో H యాంటీజెన్ అనేది నేచురల్ గా అత్యధిక మోతాదులో ఉంటుంది. AB బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో H యాంటీజెన్ అనేది అతి తక్కువ మోతాదులో ఉంటుంది. A బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో H యాంటీజెన్ అనేది A యాంటీజెన్ గా .. B బ్లడ్ గ్రూప్ కలిగిన వారిలో H యాంటీజెన్ అనేది B యాంటీజెన్ గా మారిపోతుంది. చాలామంది hh బ్లడ్ గ్రూప్ , O బ్లడ్ గ్రూప్ ఒకటేనని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రధానమైన తేడా ఏమిటంటే.. O గ్రూప్ బ్లడ్ లో యాంటిజెన్ H ఉంటుంది.. కానీ బాంబే బ్లడ్ గ్రూప్ లో యాంటీజెన్ H ఉండదు. బాంబే బ్లడ్ గ్రూప్ ను నిర్ధారించడానికి యాంటిజెన్ H రక్త పరీక్ష చేయడం అవసరం.