Sudden Cardiac Arrest: దడ పుట్టిస్తున్న ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్.. దీని లక్షణాలు, గండం నుంచి గట్టెక్కే మార్గాలివి!!
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్.. దడ పుట్టించే అంశం!!
- By Hashtag U Published Date - 08:30 AM, Thu - 18 August 22
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్.. దడ పుట్టించే అంశం!!
ఇటీవల స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్ ఝున్ వాలా, ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్,
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లాంటి ప్రముఖులు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కారణంగానే మరణించారు.
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వల్ల నిమిషాల వ్యవధిలోనే ఆయువు ఆవిరైపోతుంది. అయితే సత్వరంగా దీన్ని గుర్తించి ప్రాథమిక చికిత్స పొందడంతో పాటు వైద్య నిపుణులను సంప్రదిస్తే ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ముప్పు నుంచి గట్టెక్కే ఛాన్స్ ఉంటుంది.
ఎందుకీ కార్డియాక్ అరెస్ట్ ?
చాలామంది ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ ను.. గుండెపోటును ఒకటేనని భావిస్తుంటారు. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరు.
గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంది. కార్డియాక్ అరెస్ట్ వల్ల
గుండె నుంచి శరీరానికి సరిపడా రక్తాన్ని పంప్ చేయలేని పరిస్థితి
ఏర్పడుతుంది. రక్త సరఫరా తగ్గడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలు పనిచేయవు. ఇది గుండె కండరం బలహీనంగా ఉందని సూచిస్తుంది. రక్తం పంపింగ్ తగ్గినప్పుడు, భవిష్యత్తులో అనేక తీవ్రమైన సమస్యలు సంభవించవచ్చు.
గుండెపోటు ఎలా గుర్తించవచ్చు ?
* ఛాతీ, ఇతర శరీర భాగాల్లో నొప్పి రాకతో గుర్తించవచ్చు.
* ఛాతీ భాగంలో ఒత్తిడి ఉండటం, బిగుతుగా ఉందనిపించడం, నొప్పి లాంటి భావన రావడం.
* చేతులు, మెడ, దవడ లేదా వెనుక భాగంలో నొప్పి.
* గుండెపై భారం, మంట లేదా అజీర్ణం లాంటి అనుభూతి
* వికారం, కొన్నిసార్లు వాంతులు, చెమట పట్టినట్లుగా అనిపించడం
* శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలతిరగడం లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
* కొన్ని సందర్భాల్లో భయాందోళనకు సమానమైన ఒత్తిడి.
* ఊపిరితిత్తుల్లో నీరు ఉంటే దగ్గు లేదా శ్వాసలో గురక.
* కొన్ని సార్లు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలో తగ్గడం(Hypoxemia), పల్మరీ ఎడీమా, కార్డియాజెనిక్ షాక్ లాంటి పరిస్థితులు ఎదురవుతాయి.
వైద్యులు ఏం చేస్తారు ?
* హార్ట్ ఎటాక్ సంభవించినప్పుడు వెంటనే వీలైనంత త్వరగా వైద్య చికిత్స అందించాలి. 108 ఎమర్జెన్సీని సంప్రదించి, ఆసుపత్రిలో చేర్పించాలి.
* రోగిని ప్రత్యేక కేరింగ్‌లో ఉంచుతారు. పరిస్థితికి ముందు వారిలో ఉన్న మొత్తం వివరాలు వైద్యుడికి ఇవ్వాలి.
* వైద్యులు వారికి ఆక్సిజన్ సరఫరా అందించి చికిత్సను అందిస్తారు.
* రక్తం గడ్డలను కరిగించడానికి మందులు సహా పెర్క్యూటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్, దెబ్బతిన్న కణజాలానికి రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించే యాంత్రిక పద్ధతి, కరోనా ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్(దీన్నే బైపాస్ సర్జరీ అని పిలుస్తారు) లాంటి విధానాలు ఉన్నాయి.
* రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడానికి ధమనుల దెబ్బతిన్న ప్రాంతాల చుట్టూ ఉన్న రక్తాన్ని మళ్లిస్తారు.
* హార్ట్ ఎటాక్ తర్వాత కొంతమందిలో డిప్రెషన్, గుండె అనియంత్రంగా కొట్టుకోవడం, గుండెకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడం, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
గుండెపోటు రాకుండా ఇలా..
* హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే.. ప్రధానంగా మన అలవాట్లను మార్చుకోవాలి.
* పొగతాగడం మానుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
*డయాబెటిస్ మేనేజ్ చేసుకోవాలి.
* కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించుకోవాలి.
*ఆల్కహాల్ పరిమితిగా లేదా అసలు తీసుకోకపోవడం ఉత్తమం.
* శరీర బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి.
* వీలైనంత వరకు ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలి.
* మీ రోజువారీ ఆహారంలో కొవ్వు పరిమాణాన్ని తగ్గించండి. అదేవిధంగా, చక్కెర ఉప్పు మొత్తాన్ని తగ్గించండి.
* ఆకు కూరలు, తృణధాన్యాలు, బెర్రీలు, గింజలు, కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ వంటివి తింటే మంచిది.
* భోజనం తర్వాత మీరు మీ గది చుట్టూ కాసేపు నడవవచ్చు.ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవద్దు.
Related News
Health : డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన టాబ్లెట్స్ ధరలు
కేవలం ఈ వ్యాధులకు వాడే మెడిసిన్స్ ధరలు మాత్రమే కాదు సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలను సైతం తగ్గించింది