McDonalds Burger : మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లతో ‘ఈ-కొలి’.. ఏమిటీ ఇన్ఫెక్షన్ ?
సాధారణంగా ఈ బ్యాక్టీరియా(McDonalds Burger) మనుషులు, జంతువుల కడుపులోని పేగుల్లో ఉంటుంది.
- By Pasha Published Date - 11:22 AM, Wed - 23 October 24

McDonalds Burger : మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లను కొంతమంది ఆహార ప్రియులు చాలా ఇష్టంగా తింటుంటారు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లలో వీటి సేల్స్ పెద్దఎత్తున జరుగుతుంటాయి. అయితే ఇటీవలే అమెరికాలోని దాదాపు 10 రాష్ట్రాల్లో మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు తిన్న పలువురిలో ఈ – కొలి (E. coli) అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బయటపడింది. 49 మంది అస్వస్థతకు గురై, స్వల్ప చికిత్సతో కోలుకున్నారు. వీరిలో అత్యధికంగా 26 మంది కొలరాడోకు చెందినవారు. నెబ్రస్కాలోనూ బాధితులు ఎక్కువ మందే ఉన్నారు. 10 మంది వివిధ ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈవివరాలను స్వయంగా అమెరికా ప్రభుత్వానికి చెందిన యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది.
Also Read :Pulivendula : ఘోర ప్రమాదం.. 30 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు
ఇన్ఫెక్షన్‌కు కారణం అదేనా ?
1993లో అమెరికాలోని పలుచోట్ల హాంబర్గర్లు తిన్న పలువురిలో ఈ-కొలి O157:H7 అనే రకం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బయటపడింది. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌లు తిన్నవారిలో ఆ తరహా ఇన్ఫెక్షన్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. బర్గర్‌లోని ఏ పదార్థం వల్ల ఈ ఇన్ఫెక్షన్ కలిగింది ? అనే విషయాన్ని ఇప్పటిదాకా గుర్తించలేదు., తరిగిన ఉల్లిపాయలు, గొడ్డు మాంసం ద్వారా ఈ-కొలి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రబలి ఉంటుందని అనుమానిస్తున్నారు.కాగా, ఈ వార్తలతో స్టాక్ మార్కెట్‌లో మెక్‌డొనాల్డ్స్ షేరు ధర దాదాపు 6 శాతం క్షీణించింది.
ఈ-కొలి.. మంచిదా ? చెడ్డదా ?
‘ఈ-కొలి’ ఫుల్ ఫామ్ ‘ఎశ్చరేషియా కొలి’. ఇదొక రకమైన బ్యాక్టీరియా. సాధారణంగా ఈ బ్యాక్టీరియా(McDonalds Burger) మనుషులు, జంతువుల కడుపులోని పేగుల్లో ఉంటుంది. చాలావరకు ‘ఈ-కొలి’ బ్యాక్టీరియాల వల్ల మనిషి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు. వాస్తవానికి పేగుల్లో ఈ-కొలి బ్యాక్టీరియా కదలికల వల్ల మనం తినే ఆహారం త్వరగా జీర్ణం కూడా అవుతుంది. అయితే కొన్ని రకాల ఈ-కొలి బ్యాక్టీరియాల మనుషులు అస్వస్థతకు గురవుతుంటారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. పలు రకాల ఈ-కొలి బ్యాక్టీరియాలు నెగెటివ్‌గా రియాక్ట్ అవుతాయి. ఫలితంగా మనుషులు అస్వస్థతకు లోనవుతుంటారు. దీని పర్యవసానంగా కడుపులో తిమ్మిరి, జ్వరం, అతిసారం, వాంతులు కలుగుతాయి. ఈ-కొలి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది 4 నుంచి 7రోజుల్లోగా బయటపడుతుంది. సాధారణ చికిత్సపొంది కొంతమంది 5 రోజుల్లోనే కోలుకుంటారు.