Diabetic Coma : డేంజర్ బెల్స్.. డయాబెటిక్ కోమా !!
Diabetic Coma : డయాబెటిక్ కోమా.. మందులు వేసుకోనప్పుడు, సరిగ్గా తినని టైంలో స్పృహ కోల్పోయేంత బలహీన స్థితికి షుగర్ రోగులు చేరుకోవడం!!
- By Pasha Published Date - 08:49 AM, Tue - 12 December 23

Diabetic Coma : డయాబెటిక్ కోమా.. మందులు వేసుకోనప్పుడు, సరిగ్గా తినని టైంలో స్పృహ కోల్పోయేంత బలహీన స్థితికి షుగర్ రోగులు చేరుకోవడం!! అయితే దీనికి ఇతరత్రా ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. షుగర్ రోగుల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవల్స్ అత్యల్పంగా లేదా అత్యధికంగా అయినప్పుడు డయాబెటిక్ కోమా సంభవిస్తుంది. మన శరీరంలోని కణాలు పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అయితే షుగర్ రోగుల శరీరంలోని కణాలకు గ్లూకోజ్ సప్లై అత్యధికంగా లేదా అత్యల్పంగా జరిగినప్పుడు.. వారు స్పృహ కోల్పోయే రిస్క్ ఏర్పడుతుంది. ఈ రిస్క్‌నే మనం డయాబెటిక్ కోమా అని పిలుస్తాం.
We’re now on WhatsApp. Click to Join.
- రక్తంలో ఉండే బ్లడ్ షుగర్ లెవల్స్ భారీగా పెరిగితే షుగర్ రోగులు ‘హైపర్ గ్లైసీమియా’ అనే స్థితిని ఎదుర్కొంటారు. ఈ స్థితిలో స్పృహ కోల్పోయి డయాబెటిక్ కోమాలోకి వెళ్లే ముప్పు ఉంటుంది.
- ‘హైపర్ గ్లైసీమియా’ దశలో షుగర్ రోగి శరీరం డీహైడ్రేట్ అవుతుంది.
- శరీరంలో షుగర్‌ను పెంచే ఫుడ్ తిన్నప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, స్టైరాయిడ్స్ తీసుకున్నప్పుడు, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు హైపర్ గ్లైసీమియా రిస్క్ పెరుగుతుంది.
- హైపర్ గ్లైసీమియా స్థితి వల్ల కొందరు షుగర్ రోగుల్లో డయాబెటిక్ కీటోయాసిడోసిస్ సమస్య కూడా వస్తుంది. దీనివల్ల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉండదు. దీంతో మన శరీరం శక్తిని పొందేందుకు నిల్వ ఉన్న కొవ్వులను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఈ పరిణామంతో షుగర్ రోగుల బ్లడ్‌లోకి కీటోన్‌లు రిలీజ్ అవుతాయి. వెరసి.. చివరకు రోగి కోమాలోకి వెళ్తాడు.
- హైపర్ గ్లైసీమియా స్థితిలోకి వెళితే షుగర్ రోగులు అలర్ట్ కావాలి. లేదంటే అది డయాబెటిక్ కోమాకు(Diabetic Coma) దారితీయొచ్చు.
- హైపర్ గ్లైసీమియా స్థితిలో ఉన్నప్పుడు బయటపడే లక్షణాల్లో.. విపరీతమైన చెమట, ఆందోళన, ఆకలి పెరగడం, ఆకలి తగ్గడం, వణుకు, కడుపులో వికారం, కడుపు నొప్పి, శ్వాసలో ఇబ్బందులు, అలసట, ఎక్కువగా మూత్రవిసర్జన, నడిచేందుకు కూడా ఓపిక లేకపోవడం, ఆకలి, దాహం పెరగడం వంటివి ఉన్నాయి.