Lemon Water: మంచిదే కదా అని లెమన్ వాటర్ ని ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త!
నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆ పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 04:30 PM, Thu - 5 September 24
మామూలుగా వేసవికాలం మొదలైంది అంటే చాలు చాలామంది లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. కేవలం వేసవిలో మాత్రమే కాకుండా నీరసంగా అనిపించినప్పుడు వాంతులు విరోచనాలు అయినప్పుడు చాలామంది లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది సందర్భం సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు లెమన్ వాటర్ ని తాగుతూ ఉంటారు. అయితే లెమన్ వాటర్ మంచిదే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు వైద్యులు. మరి లెమన్ వాటర్ ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ముఖ్యమైన అవయవాలు, మొత్తం శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే శరీరానికి విటమిన్ సి చాలా అవసరం అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచుతుందట. అలాగే ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. శరీరంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి విటమిన్ సి ను మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. నిమ్మకాయ నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే అధికంగా విటమిన్ సి తీసుకోవడం వల్ల కడుపులో అధికంగా యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుందట. ఇది ఎసిడిటీని పెంచుతుందని, జీర్ణ సమస్యలకీ దారితీస్తుందని చెబుతున్నారు. అలాగే నిమ్మరసం ఎక్కువగా తాగే వారికి నోటి పూత వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట. నోటి దుర్వాసనతో పోరాడడానికి దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నప్పటికీ అధికంగా నిమ్మకాయ నీరు తాగితే నోటి మంటకు దారి తీస్తుందట. కాబట్టి నిమ్మకాయ నీరు తక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలాగే మీరు ప్రతిరోజు ఏదైనా జబ్బులకు మందులను ఉపయోగిస్తున్నట్లయితే నిమ్మకాయ నీరు తాగే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయట.
Related News
Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ జ్యూస్లను అస్సలు తాగకూడదు..!
ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, అయితే ఇందులో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది.