Coffe: నెల రోజులు కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
చాలామందికి ఉదయం లేవగానే టీ కాఫీ లాంటివి తాగడం అలవాటు. ఉదయం లేచిన తర్వాత కాఫీ టీ తాగనిదే చాలామందికి రోజు కూడా మొదలు కాదు. ఇంకొందరు అయితే రోజులు కనీసం ఒక్కసారి అయినా కాఫీ టీలు తాగకపోతే పిచ్చి పట్టినట్టుగా ఉందని అంటూ ఉంటారు. అయితే, కాఫీ టీ తాగడం మం
- By Anshu Published Date - 02:10 PM, Thu - 25 July 24

చాలామందికి ఉదయం లేవగానే టీ కాఫీ లాంటివి తాగడం అలవాటు. ఉదయం లేచిన తర్వాత కాఫీ టీ తాగనిదే చాలామందికి రోజు కూడా మొదలు కాదు. ఇంకొందరు అయితే రోజులు కనీసం ఒక్కసారి అయినా కాఫీ టీలు తాగకపోతే పిచ్చి పట్టినట్టుగా ఉందని అంటూ ఉంటారు. అయితే, కాఫీ టీ తాగడం మంచిదే కదా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే మితంగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఒకవేళ నెలరోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు మనం
తెలుసుకుందాం..
మీరు ఒక నెల పాటు కాఫీ తాగడం మానేస్తే, కెఫీన్ లేకపోవడం వల్ల తలనొప్పి, అలసట లాంటివి వస్తాయట. చిరాకు , ఏకాగ్రత కష్టంగా ఉంటుంది. ఇవి మొదటి రెండు, మూడు రోజులు మాత్రమే కనపడతాయని, ఆ సమయంలో చాలా కష్టంగా అనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ఆ రెండు మూడు రోజులు ఓపిక పడితే ఆ తర్వాత కాఫీ మానేస్తే ఎలాంటి పరిస్థితులు కనిపించని చెబుతున్నారు. కాగా ఒక నెల పాటు కాఫీని మానేయడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందట. అలాగే శక్తి కోసం కెఫిన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందట. కాపీ తాగడం వల్ల మన శరీరం డీహైడ్రెట్ డ్ గా మారుుతందట.
కాఫీ మానేస్తే డీ హైడ్రేషన్ సమస్య ఉండదట. అలాగే కాఫీ కొందరిలో జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుందట. కాబట్టి కాఫీని మానేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా అజీర్ణం సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. కాఫీకి బదులుగా కెఫిన్ లేని పానీయాలు మంచి ఆర్ద్రీకరణకు దోహదం చేస్తాయట. ఇది మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనది. అదేవిధంగా కాఫీ తాగడం మానేయడం నేరుగా బరువు తగ్గడానికి దారితీయనప్పటికీ, చక్కెర, క్రీమ్ వంటి అధిక కేలరీల కాఫీ సంకలితాలను తొలగించడం వల్ల కేలరీల తీసుకోవడం తగ్గించవచ్చట. ఇది బరువు నిర్వహణకు దోహదం చేస్తుందట. కాబట్టి నెల రోజులు కాఫీకి దూరంగా ఉంటే లాభాలే తప్ప ఎటువంటి నష్టాలు ఉండవు అని చెబుతున్నారు పండితులు.