Stand Too Long: ఎక్కువసేపు నిలబడి పని చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది షాపింగ్ మాల్స్, కొన్ని ఇండస్ట్రీలలో ఎక్కువసేపు నిలబడి పని చేస్తూ ఉంటారు. ఎక్కువ సేపు నిలబడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ కొన్ని పరిస్థితులలో అలాంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
- By Anshu Published Date - 11:05 AM, Sat - 20 July 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది షాపింగ్ మాల్స్, కొన్ని ఇండస్ట్రీలలో ఎక్కువసేపు నిలబడి పని చేస్తూ ఉంటారు. ఎక్కువ సేపు నిలబడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ కొన్ని పరిస్థితులలో అలాంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎక్కువసేపు నిలబడి పనిచేయడం వల్ల కూడా అలాంటి సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు. మరి ఎక్కువసేపు నిలబడి పని చేస్తే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎక్కువసేపు నిలబడటం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుందట. నిజానికి నిలబడటం వల్ల పాదాల వైపు రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దీని వల్ల గుండెకు తగినంత రక్త ప్రసరణ జరగదట. అలాగే ఎక్కువసేపు నిలబడడం వల్ల కిందకు వచ్చిన రక్తాన్ని మళ్లీ పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుందట. ఇది గుండెపై భారాన్ని పెంచుతుందట. అలాగే ఎక్కువసేపు నిలబడటం వల్ల పాదాలలో వాపు కూడా వస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాలు కింది భాగంలో రక్తం గడ్డ కట్టడం జరుగుతుందట. దీని వల్ల పాదాలు వాపునకు గురవుతాయట. ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాళ్లతో పాటుగా వెన్నునొప్పి, నడుము నొప్పి సమస్యలు మరింత పెరుగుతాయి.
ఎక్కువ సేపు నిలబడటం భంగిమ క్షీణించడం వల్ల వెన్నునొప్పి, నడుము నొప్పి వస్తాయి. అలాగే ఎక్కువ సేపు నిలబడటం వల్ల కండరాలలో అలసట కూడా కలుగుతుందట. ఇది కండరాల నొప్పులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. ఎక్కువ సేపు నిలబడడం వల్ల రక్తప్రసరణ కూడా దెబ్బతింటుందట. దీని వల్ల సిరల్లో అడ్డంకులు ఏర్పడి పాదాల్లో నీలి రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది కాలులో భరించలేని నొప్పిని కూడా కలిగిస్తుందట. అందుకే ఎక్కువసేపు నిలబడి పని చేయకూడదు అంటున్నారు. ఒకవేళ మీరు అలా నిలబడాల్సి వచ్చిన మధ్యలో చిన్న చిన్న వాటి కోసం బ్రేక్ తీసుకొని మరి పని చేసుకోవడం మంచిదని, అది మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు.