Health Tips: ఫ్రిజ్లో స్టోర్ చేసిన పిండితో.. చపాతీ చేసి తింటున్నారా.. డేంజర్ బెల్ మోగినట్లే!
Health Tips: ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చపాతీ పిండితో చపాతీలు తయారు చేసుకొని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు నుంచి హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన పిండితో చపాతీలు చేసుకుని తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Tue - 2 December 25
Health Tips: ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ లు తప్పనిసరిగా ఉంటున్నాయి. అయితే ఫ్రిడ్జ్ లు పూర్తి వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆహార పదార్థాలను ఇందులోనే స్టోర్ చేస్తున్నారు. ముఖ్యంగా చపాతీ పిండి,దోస పిండి, గోధుమ పిండి ఇలా చాలా రకాల ఆహార పదార్థాలను ఇందులోనే స్టోర్ చేస్తున్నారు. కాగా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతిసారి చపాతీ పిండిని తడిపి పెట్టడం బదులు చాలా మంది ముందు రోజు రాత్రి పిండిని పిసికి కలుపుతారు. మిగిలిపోయిన పిండిని మరుసటి రోజు కోసం ఫ్రిజ్ లో ఉంచుతారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు అంటున్నారు.
రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన పిండి ఆరోగ్యానికి హానికర అని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పిండి 24 గంటల్లో నిరుపయోగంగా మారుతుందట. ఆ తర్వాత దానిని నివారించాలని చెబుతున్నారు. పిండిని చల్లని ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల కిణ్వ ప్రక్రియ ఆగదట. బదులుగా దానిని నెమ్మదింపజేస్తుందని, పిండిలోని ఈస్ట్, బ్యాక్టీరియా చల్లని ఉష్ణోగ్రతల వద్ద మరింత నెమ్మదిగా పనిచేస్తూనే ఉంటాయని, ఇది కాలక్రమేణా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. ఈ ప్రక్రియ పిండి ఆకృతిని, రుచిని మాత్రమే కాకుండా దాని రసాయన స్వభావాన్ని కూడా మారుస్తుందట. రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసిన పిండితో తయారు చేసిన చపాతీలను తినడం వల్ల పలు ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయట. రిఫ్రిజిరేటర్ లో ఎక్కువసేపు కిణ్వ ప్రక్రియ చేయడం వల్ల పిండిలోని గ్లూటెన్ బలహీనపడుతుందట.
ఇటువంటి పిండితో తయారు చేసిన చపాతీలు గట్టిగా ఉంటాయని అవి జీర్ణం కావడం కష్టం అని చెబుతున్నారు. ఫలితంగా గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు పెరుగుతాయట. పిండిని ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తే దానిలోని విటమిన్లు, ఖనిజాలు తగ్గుతాయట. ఈ పిండితో తయారు చేసిన చపాతీలు కడుపు నింపుతాయి. కానీ శరీరానికి అవసరమైనంత పోషకాహారం లభించదట. రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసిన పిండి గది ఉష్ణోగ్రత వద్ద ఉండే పిండి కంటే స్టార్చ్ ను త్వరగా చక్కెరగా మారుస్తుందట. ఇలాంటి చపాతీలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని,ఈ ఆహారం మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు చపాతీ తినాలని అనుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పిండిని తడుపుకొని చపాతీ చేసుకొని తినడం మంచిది.