Coriander: పచ్చి కొత్తిమీర తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
కొత్తిమీర రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.
- By Anshu Published Date - 04:00 PM, Thu - 8 August 24

కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆకుకూరలలో ఒకటైన కొత్తిమీరను ఎన్నో రకాల వంటల్లో తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కొత్తిమీర రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. కొత్తిమీరలో ఫైబర్, కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి లు పుష్కలంగా లభిస్తాయి. అయితే కేవలం వంటల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మనం ఏవైనా బయట స్నాక్స్ రూపంలో తింటున్నప్పుడు పచ్చి కొత్తిమీరను అలాగే తినేస్తూ ఉంటాం.
మరి ఇలా పచ్చికొత్తిమీరను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొత్తమీర జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే మీ ఆహారంలో పచ్చి కొత్తిమీరను చేర్చుకోవడం మంచిది. పచ్చి కొత్తిమీరను మజ్జిగలో కలిపి తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం సమస్య కూడా ఉండదని వైద్యులు చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి కోతిమీర ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పచ్చ కొత్తిమీరన తరచుగా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయట.
దీంతో రక్తంలో ఇన్సులిన్ పరిమాణం నియంత్రణలో ఉంటుందట. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటుతో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుందని చెబుతున్నారు. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి పచ్చి కొత్తిమీర బాగా సహాయపడుతుందట. పచ్చి కొత్తిమీరలో ఉండే మూలకం కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుందట. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి పచ్చి కొత్తిమీరతో పాటుగా ధనియా వాటర్ ను కూడా తాగచ్చని చెబుతున్నారు. పచ్చికొత్తిమీర మన కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా బాగా సహాయపడుతుందట. దీనిలో విటమిన్ -ఎ పుష్కలంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కంటిచూపు కూడా బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే మూత్ర సమస్యలు మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.