Alcohol: ఒక్కసారిగా మద్యం సేవించడం మానేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఊహించని సమస్యలు!
మద్యం సేవించడం మానేయడం మంచిదే కానీ, అలా అని ఒకేసారి మద్యం సేవించడం మానేయడం అస్సలు మంచిది కాదని దీనివల్ల ఊహించని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:03 AM, Thu - 13 March 25

మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చిన్న పిల్లలు కూడా మద్యం సేవించడం అలవాటుగా చేసుకున్నారు. ముఖ్యంగా యుక్త వయసు వచ్చేసరికి మధ్యానికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. కొంతమంది కారణాల వల్ల మద్యం సేవించడం ఆపాలని అనుకుంటూ ఉంటారు. ఈ ఆలోచన మంచిదే కానీ మద్యం సేవించేవారు ఉన్నపలంగా ఒక్కసారిగా వదిలేయకూడదని చెబుతున్నారు. ఒకవేళ ఉన్నఫలంగా మద్యం సేవించడం ఆపేస్తే ఏం జరుగుతుందో ఇలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒక్కసారిగా మద్యం సేవించడం ఆపేస్తే మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయట. ముఖ్యంగా మద్యం మానేయడం వల్ల మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందట. మద్యపానం మానేసిన తర్వాత చెవుల్లో శబ్దాలు వినిపించడం, ఇతరులు పిలుస్తున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మద్యపానం ఒక్కసారిగా ఆకస్మాత్తుగా మానేయకుండా క్రమంగా మానాలని చెబుతున్నారు.
రెండుమూడు నెలలకు ఒక సారి, నెలకు ఒక రెండు సార్లు మందు తాగే వారు సడన్ గా మందు మానేసినా ఎలాంటి ప్రమాదం ఉండకపోయినా ప్రతిరోజూ తాగేవారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుందని ఇది అనేక సమస్యలను తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. ఎక్కువ కాలం పాటు మద్యం సేవించిన వ్యక్తి అకస్మాత్తుగా మద్యం మానేసినప్పుడు, మూడు రోజుల్లోనే మానసిక సమస్యలు కనిపిస్తాయట. కొన్నిసార్లుముందే ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి, కోపం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఎక్కువ కాలంగా మద్యం సేవించిన వారు అకస్మాత్తుగా మానేస్తే, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందట. కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయట. కాగా మద్యం సేవించేవారు ఆ అలవాటుని మానుకోవాలి అనుకుంటే నెమ్మది నెమ్మదిగా నా అలవాటుని మానుకోవాలని అంతేకానీ సడన్గా మానేయకూడదని చెబుతున్నారు.