Summer Dry Lips: వేసవిలో పదేపదే పెదాలు పొడిబారుతున్నాయా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?
వేసవి కాలంలో చాలా మందికి పెదవులు పొడిబారడం అన్నది ప్రధాన సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ పెదవులు పొడి భార్య కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ
- By Nakshatra Published Date - 10:00 PM, Wed - 14 June 23
వేసవి కాలంలో చాలా మందికి పెదవులు పొడిబారడం అన్నది ప్రధాన సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ పెదవులు పొడి భార్య కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. వేసవికాలంలో గాలిలోని తేమ పోయి పొడిగా మారుతుంది. పొడి గాలి వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారి నిస్తేజంగా మారుతుంది. వేడి వాతావరణం అందమైన పెదవుల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. వేసవి ప్రభావం సున్నితమైన పెదాలపై ఎక్కువగా ఉంటుంది. ఈ పెదాలు పొడిబారడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు..
వ్యాసిలిన్,లిబ్బామ్ ఇలా రకరకాలుగా అప్లై చేసినప్పటికీ వెంటనే డ్రై అయిపోయి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అయితే వేసవిలో పెదాలను మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి పలు మార్గాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో పెదవుల పొడి బారి సమస్యగా ఉంటే ముందుగా చేయాల్సిన అతి ముఖ్యమైన పని నీరు ఎక్కువగా తాగడం. రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల పెదాలు పొడిబారకుండా, పగిలిపోకుండా ఉంటాయి.
పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా కూడా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. అలాగే వేసవిలో సూర్య కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడితే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. సూర్య కిరణాలు పెదాలపై పడినప్పుడు పెదాలు పొడిగా మారుతాయి. పగుళ్లు కూడా వస్తాయి. అలాగే రంగు కూడా మారతాయి. సూర్య కిరణాల నుండి పెదాలను రక్షించుకోవడానికి ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్ ఉపయోగించడం ముఖ్యం. అదేవిధంగా పెదాలను ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి, కొత్త ఆరోగ్యకరమైన చర్మాన్ని వృద్ధి చెందుతాయి.
చక్కెర, కొబ్బరి నూనెను మిక్స్ చేసి, పెదాలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమంలో పెదాలపై మర్దనా చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. పెదాలు పొడిబారి పగిలిపోతే చాలా చికాకుగా ఉంటుంది. పెదాలు పగిలిన చాలా మంది నాలుకతో వాటిని తడి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పెదాలు మరింతగా పొడి బారిపోతాయి. లాలాజలంలో ఉండే ఎంజైమ్ లు పెదవుల పై సున్నితమైన చర్మాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దీని వల్ల మరింత పొడిగా మారి చికాకును కలిగిస్తుంది. పెదాలపై ఉపశమనం కలిగించడానికి హైడ్రేటింగ్ లిప్ బామ్‌ను ఉపయోగించడం మంచిది.
Tags
Related News
Summer: సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగడం మస్ట్.. ఎందుకంటే
Summer: వేసవి కాలంలో శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి, పుష్కలంగా నీరు తాగడంతోపాటు కొబ్బరిని తాగడం చాలా ముఖ్యం. వేసవిలో లిక్విడ్ డైట్ తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలో నీటి కొరత లేకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగండి. దీని కారణంగా, శరీరంలో తగినంత శక్తి, ఖనిజాల సమతుల్యత ఉంది. వేసవిలో ఎప్పుడైనా కొబ్బరి న�