HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Warm Water Bath Is Good In Winter

‎Winter: వామ్మో.. చలికాలంలో ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే ఇంత డేంజరా?

‎Winter: చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం శరీరానికి మేలు చేస్తుందని, అతి వేడిగా ఉండే నీరు గుండె, చర్మ సమస్యలు పెంచుతుందని చెబుతున్నారు.

  • By Anshu Published Date - 08:00 AM, Wed - 19 November 25
  • daily-hunt
Winter Warm Water
Winter Warm Water

‎Winter: చలికాలం వచ్చింది అంటే చాలు.. చలికి తట్టుకోలేక చాలా మంది వేడి నీతో స్నానం చేయడం, ముఖం శుభ్రం చేసుకోవడం, వేడి నీటితో కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. చలికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతూ ఉంటారు. మరోవైపు నీళ్లు చల్లగా ఉంటాయి. ఉదయం సాయంత్రం వేళలో నీటిని ముట్టుకోవాలంటే చేతులు వణికి పోతుంటాయి. అందుకే చలికాలంలో చాలామంది సహజంగా వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు. మరి కొంతమంది చలిని సైతం లెక్కచేయకుండా చల్లటి నీటితో స్నానం చేస్తారు. అయితే కొందరు అయితే చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తూ ఉంటారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా కండరాలు, కీళ్లకు ఉపశమనం కలుగుతుంది.
‎
‎మనసు ప్రశాంతంగా రిలాక్స్ గా ఉండాలంటే వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. వేడినీటితో స్నానం చేయడం వల్ల చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి. పేరుకుపోయిన మురికి, శరీరం శుభ్రపడి బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తుందట. చలికాలంలో స్నానం చేయడానికి గోరువెచ్చని నీరు ఉత్తమమైనదని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు చల్లదనాన్ని తగ్గిస్తుందట. అదే సమయంలో చర్మానికి హాని కలిగించకుండా సహజ నూనెలను కాపాడుతుందట. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా శరీరానికి మేలు జరుగుతుందట. ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం ద్వారా కొన్ని రకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయట. వేడి నీళ్లు తల చర్మాన్ని పొడిబారేలా చేస్తాయట.
‎
‎ఇది చుండ్రు, జుట్టు రాలడం, దురద వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అతి వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా కొన్నిసార్లు తలనొప్పి పెరగవచ్చట. కొందరికి తాత్కాలికంగా బీపీ తగ్గిపోయినట్లు అనిపించవచ్చని చెబుతున్నారు. అతి వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. గుండె జబ్బులు ఉన్న వారికి వేడి నీరు రక్తనాళాలను విస్తరింపజేస్తుందని చెబుతున్నారు. ఇది గుండెపై అదనపు భారం పడేలా చేస్తుందని చెబుతున్నారు. వేడి నీళ్ల వల్ల శరీరం అధికంగా శ్రమ పడాల్సి వస్తుందట. దీనికి గుండె అధికంగా స్పందించవలసి ఉంటుందట. గుండెపోటు, స్ట్రోక్ పెరిగే ప్రమాదం ఉంటుందట. గుండె సమస్యలు ఉన్నవారు అతి వేడి నీళ్లు కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలట. ఫిట్స్ ఉన్నవారు బాగా చల్లని నీరు, అతిగా వేడి నీటితో స్నానం చేయడం అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ‎చర్మ సమస్యలు ఉన్నవారు అతిగా వేడి నీరు చేయడం ద్వారా అవి మరింత పెరిగే అవకాశం ఉంటుందట. ఈ వ్యాధితో బాధపడేవారు ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం మరింత ఎర్రగా కందిపోతుందట. అతిగా వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా ఏ వ్యక్తికైనా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు బాగా చల్లటి నీరు, అతిగా వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bathing
  • Hot Water
  • Warm Water
  • Winter. Winter tips

Related News

Winter Bath

‎Winter: చలికాలంలో చల్లనీరు లేదా వేడినీరు ఏ నీటితో స్నానం చేస్తే మంచిదో మీకు తెలుసా?

‎Winter: చలికాలంలో చల్లనీరు లేదా వేడి నీరు ఈ రెండింటిలో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది, దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

    Latest News

    • Essence of Indian Contemporary Art: హైద్రాబాద్ కు ‘కంటెంపరరీ నౌ’

    • Shubman Gill: సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ అందుబాటులో ఉంటాడా?

    • Divya Bharathi : సుడిగాలి సుధీర్ మౌనంపై ‘గోట్’ హీరోయిన్ ఆవేదన.. దర్శకుడి పై షాకింగ్ పోస్ట్

    • World Toilet Day 2025: నేడు మరుగుదొడ్ల దినోత్సవం.. బాత్‌రూమ్‌ను క్లీన్‌గా ఎలా ఉంచుకోవాలంటే?

    • Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మకు భారీ నష్టం!?

    Trending News

      • Vasamsetti Subhash : తెలంగాణలో మా కులాన్ని అన్యాయం జరుగుతోంది: ఏపీ మంత్రి

      • AP Liquor Scam : మద్యం స్కాంలో కీలక పరిణామం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్..!

      • Share Market : సీన్ రివర్స్.. భారీగా పెరిగి ఒక్కసారిగా గ్రో స్టాక్స్ లోయర్ సర్క్యూట్.!

      • SBI : ఎస్బీఐ ఆల్ టైమ్ హైకి షేర్ ధర.. రూ. 4 లక్షలొచ్చాయ్.!

      • Maoists Encounter : మారేడుమిల్లి లో దేవ్‌జీ సహా ఏడుగురు మావోయిస్టులు హతం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd