HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Vitamin C Foods And Health Benefits

Vitamin C: విటమిన్ సి కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాల విటమిన్లు అవసరం. అటువంటి వాటిలో విటమిన్ సి కూడా ఒకటి. విటమిన్ సి ఈ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అ

  • Author : Anshu Date : 02-02-2024 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 02 Feb 2024 04 52 Pm 3935
Mixcollage 02 Feb 2024 04 52 Pm 3935

మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాల విటమిన్లు అవసరం. అటువంటి వాటిలో విటమిన్ సి కూడా ఒకటి. విటమిన్ సి ఈ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎనర్జీని ఇస్తుంది. కాగా విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటారు. ఈ విట‌మిన్ నీటిలో క‌రుగుతుంది. క‌ణ‌జాలం, మృదులాస్థి అభివృద్ధికి, నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌రం అవుతుంది. అలాగే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. విట‌మిన్ సి ఉండే పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. మరి విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జ‌లుబు, ఫ్లూ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఈజీగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జ‌లుబు, ముక్కు కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను విట‌మిన్ సి త‌గ్గిస్తుంది. జ‌లుబుకు కార‌ణ‌మ‌య్యే అల‌ర్జీలు కూడా త‌గ్గుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య ఉన్న‌వారు విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది. విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే హైబీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. కాగా ప్ర‌స్తుత ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో ఒత్తిడి అనేది ప్ర‌తి ఒక్క‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది.

అయితే విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి త‌గ్గుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు విట‌మిన్ సి ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో జీవ‌క్రియ‌లు పెరుగుతాయి. అదేవిధంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. మ‌న శ‌రీరం కొల్లాజెన్ అనే ప‌దార్థాన్ని స‌హ‌జంగా ఉత్ప‌త్తి చేస్తుంది. అందుకు విట‌మిన్ సి అవ‌స‌రం అవుతుంది. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉండ‌వు. చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి. విట‌మిన్ సి మ‌న‌కు ఎక్కువ‌గా నిమ్మ‌, ఉసిరి, నారింజ‌, బ‌త్తాయి, ద్రాక్ష‌, ట‌మాటాలు, కివీలు, బొప్పాయి, పైనాపిల్ వంటి పండ్లు, కూర‌గాయ‌ల్లో ల‌భిస్తుంది. వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకుంటే విటమిన్ సి లోపం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • vitamin c
  • Vitamin C Benefits
  • Vitamin C Foods

Related News

Delicious Dishes

గ్యాస్‌తో పని లేకుండా ఫుడ్ త‌యారుచేసుకోండిలా!

గ్యాస్‌తో పని లేకుండా తక్కువ ఖర్చుతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ వాడకుండా తయారు చేయగల 3 ప్రత్యేక వంటకాలు ఏంటో చూద్దాం..!

    Latest News

    • ఈది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

    • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

    • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

    • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

    Trending News

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd