Weight: ఉదయాన్నే చేసే కొన్ని తప్పులు.. మీ బరువును అమాంతం పెంచేస్తాయి
ఉదయాన్నే మీరు చేసే కొన్ని తప్పులు నడుము సైజును వేగంగా పెంచుతాయి. మీ బరువును పెంచుతాయి.ఆరోగ్యానికి
- By Nakshatra Published Date - 06:30 PM, Tue - 24 January 23
ఉదయాన్నే మీరు చేసే కొన్ని తప్పులు నడుము సైజును వేగంగా పెంచుతాయి. మీ బరువును పెంచుతాయి.ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తాయి.అలాంటి కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం.
మీ రోజంతా ఎలా సాగుతుంది అనేది.. మీరు మీ రోజును ఎలా ప్రారంభించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనస్సు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. ఉదయం వేళ సరైన దినచర్య కూడా అవసరం. అనారోగ్యకరమైన రీతిలో ఉదయం టైం ను ప్రారంభిస్తే ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం పడుతుంది. అలారం మోగిన తర్వాత కూడా నిద్ర లేవకపోవడం.. ఉదయం పూట ముందుగా కాఫీ, టీలు తాగడం, అల్పాహారం తీసుకోకపోవడం వంటివి రోజూ చేసే పొరపాట్లు. బరువు పెరగొద్దు అనుకుంటే ఈ తప్పులు రిపీట్ చేయొద్దు.
* ఎక్కువ నిద్ర
రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ మీరు అంతకంటే ఎక్కువ లేదా తక్కువ నిద్రపోతే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీ బరువు కూడా వేగంగా పెరగడం ప్రారంభమ వుతుంది. మీరు తెల్లవారుజాము వరకు నిద్రపోతే, మీరు సమయానికి అల్పాహారం తీసుకోలేరు.ఇది మీ జీవక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రోజూ 9 నుంచి 10 గంటలపాటు నిద్రపోయేవారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం 21 శాతం ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.
* ఉదయాన్నే నీళ్లు తాగకపోవడం
ఉదయాన్నే ఈ పొరపాటు చేస్తే మీ వెన్నుపై ఊహించలేనంత ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో ఏ రకమైన పనితీరుకైనా నీరు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నీరు మన శరీరంలోని వ్యర్థ పదార్థాలన్నింటినీ బయటకు పంపి, మనల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయ పడుతుంది. ఉదయం పూట ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
* తప్పుడు విషయాలతో రోజును ప్రారంభించడం
ఆరోగ్యకరమైన బరువు , శరీరం కోసం ఉదయం వేళ సరైన ఆహారాన్ని తినాలి. మీరు ఉదయం అధిక ప్రోటీన్ అల్పాహారం తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కానీ చాలామంది ఉదయం పూట అనేక అనారోగ్యకరమైన వస్తువులను తీసుకుంటారు. ఉదయాన్నే అధిక కొవ్వు, అధిక సోడియం కలిగిన అల్పాహారాన్ని తినకుండా ఉంటే రోజంతా మీ పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో, ఉదయం పూట ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ ను తినొద్దు. ఇది రోజంతా మీ కడుపులో గ్యాస్‌ను కలిగిస్తుంది.
* భోజనం చేస్తూ టీవీ చూడటం
చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీవీ ఆన్ చేసి వార్తలు చూడటం ప్రారంభిస్తారు. చాలా మంది అల్పాహారం తీసుకునేటప్పుడు కూడా టీవీ చూస్తూనే ఉంటారు. ఇది మీ ఆరోగ్యానికి చాలా చెడ్డది. మీరు టీవీ చూస్తూ ఆహారం తిన్నప్పుడు, ఈ సమయంలో మీ దృష్టి పూర్తిగా టీవీపై ఉంటుంది ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంది.
* చక్కెర, క్రీమ్ కలిపిన కాఫీ తాగడం
ఉదయాన్నే క్రీమ్, చక్కెర అధికంగా ఉండే కాఫీని తాగడం వల్ల మీ బరువు వేగంగా పెరుగుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే .. కాఫీలో సాధారణ పాలకు బదులుగా, చక్కెర లేని సోయా పాలు, బాదం పాలు, ఓట్స్ పాలు ఉపయోగించండి.
* ఉదయం పూట వ్యాయామం చేయకపోవడం
ఖాళీ కడుపుతో ఉదయం వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే, రోజూ ఉదయం వ్యాయామం, నడక , జాగింగ్ చేయండి.
Related News
Hero Ram: స్కంధ మూవీ కోసం 12 కిలోల బరువు పెరిగా: హీరో రామ్
నా పాత్ర కోసం సిద్ధం కావడానికి నేను 12 కిలోలు పెరిగాను