Health Tips : ఉదయాన్నే అలసిపోతున్నారా? యాక్టివ్ గా ఉండేందుకు ఈ చిట్కాలు అనుసరించండి..!!
ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలామంది అలసటతో కనిపిస్తారు. నిద్ర లేవడానికి బద్దకిస్తుంటారు.
- By hashtagu Published Date - 09:22 PM, Sat - 15 October 22

ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా చాలామంది అలసటతో కనిపిస్తారు. నిద్ర లేవడానికి బద్దకిస్తుంటారు. ఈ అలసట అలాగే కొనసాగితే ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ద వహించడం ముఖ్యం. ఉదయాన్నే ఫ్రెష్ గా అనిపించేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
1. కొందరు నిద్రలేచిన వెంటనే టీ. కాఫీని తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం. దీన్ని తాగడం మానుకోండి.
2. ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయండి. ఇలా చేస్తే మీరు రోజంతా తాజాగా ఉంటారు. దీని వలన మీ శరీరం ఆరోగ్యంగా ఉండటంతోపాటు మీరు చురుకుగా ఉంటారు.
3. రోజంతా తాజాగా ఉండాలంటే ఉదయాన్నే వైద్యులు సలహా ఇస్తున్నారు. ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించాలి. ఇది మీకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
4. ఉదయం లేవగానే తప్పనిసరిగా గోరువెచ్చని నీరు తాగాలి. ఇది మీకు కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
5. బొప్పాయిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. దీనిలో శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల జీర్ణశక్తి బాగా జరుగుతుంది. అదనంగా, ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది.
6. ఖర్జూరం ఉదయం తినడం చాలా మంచిది. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎనర్జీ అందడంతో పాటు అనేక పోషకాలు కూడా ఇందులో లభిస్తాయి.
7. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తేలికపాటి ఆహారం తినడం ద్వారా రోజును ప్రారంభించాలి. బాదంపప్పును రాత్రి నానబెట్టి, ఉదయం తినండి. ఇది మీ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
8. ఉదయం అలసట నుండి బయటపడటానికి మీ శరీరానికి నూనెతో మసాజ్ చేయండి. ఇది మిమ్మల్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
9. రాత్రి పడుకునే అరగంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ ఆపరేట్ చేయడం మానుకోండి. ఇవి మీ అలసటను కూడా పెంచుతాయి.