Banana Peel: అరటి తొక్క వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా?
అరటి తొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Tue - 8 October 24

మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభించే పనుల్లో అరటిపండు కూడా ఒకటి. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సీజన్లో మనకు అరటి పండ్లు లభిస్తూ ఉంటాయి. అయితే చాలామంది అరటి పండ్లు తిన్న తర్వాత వాటి తొక్కను పారేస్తూ ఉంటారు. ఒకసారి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేవలం అరటిపండు వల్ల మాత్రమే కాకుండా అరటి పండు తొక్క వల్ల కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయట. అరటి పండ్లలో విటమిన్ బి6, విటమిన్ బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మనమందరం అరటి పండు తొక్క తీసేసి, పండు తింటూ ఉంటాం. అయితే పండుతో పాటు, తొక్క కూడా ఆరోగ్యానికి మంచిదట.
ఈ తొక్కలు చర్మ సంరక్షణకే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. అరటితొక్కను వెన్నతో కలిపి తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. అరటి తొక్కలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అరటి తొక్కల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మలబద్దకాన్ని కూడా పోగొడుతుందట. అధిక రక్తపోటు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అయితే అరటి తొక్కలను తింటే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.
అరటి తొక్కలో ఫైబర్ కంటెంట్ తో పాటుగా పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. అరటి పండ్లను తొక్కతో సహా రోజూ తింటే అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. హైబీపీ పేషెంట్లు తొక్కను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తింటే మంచిదట. అరటి తొక్కలు ఎముకలను బలంగా చేయడానికి కూడా సహాయపడతాయి. అరటిపండ్లలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అందుకే రోజూ ఒక అరటిపండును పిల్లలకు తినిపించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు అరటిపండును తొక్కతో సహా తినడం మంచిది. అరటి తొక్క కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలో విటమిన్ ఎ ఉంటుంది.
ఇది కంటి చూపును మెరుగుపర్చడంతో పాటుగా కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అరటి తొక్క మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం అరటితొక్క లోపలి తెల్లని భాగాన్ని ముఖంపై నిమిషం పాటు రుద్దండి. 30 నిమిషాల తర్వాత నీటితో మీ ముఖాన్ని నీట్ గా కడుక్కోండి. తరచుగా ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటుగా చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఇలా కాకుండా ఓట్స్, అరటి తొక్కలతో ప్యాక్ తయారు చేసుకుని కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇందుకోసం ఒకటిన్నర కప్పుల ఓట్స్ ని తీసుకోవడం మంచిది.