Health Tips: గ్యాస్ మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. వెంటనే ఇలా చేయండి!
గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు..
- By Anshu Published Date - 04:00 PM, Thu - 26 September 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది మలబద్ధకం కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. చిన్న వయసు వారు కూడా ఈ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకు ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సమస్య నుంచి బయట పడటం కోసం ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం చాలామంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వైద్యుల సలహా తీసుకోవడంతో పాటు ఇంకొందరు హోమ్ రెమిడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలు పదేపదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కొన్ని రకాల చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మనలో చాలామందికి రోజులో కనీసం ఒక్కసారి అయినా టీ తాగి అలవాటు ఉంటుంది. టీ తాగడం మంచిదే కానీ మీరు టీ తాగేటప్పుడు అందులోకాస్త అల్లం వేసుకుని తాగడం మంచిది. అల్లం టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, డైజెస్టివ్ లక్షణాలు గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం వేడి నీటిలో తాజా అల్లం ముక్కలు లేదా అల్లం పొడినివేడి మరిగించి అల్లం టీని తయారుచేసి తాగడం మంచిదని చెబుతున్నారు. అలాగే వేడినీటిలో సగం నిమ్మరసం కలిపి తాగడం వల్ల అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. నిమ్మరసం జీర్ణ క్రియను ప్రేరేపిస్తుందట. అలాగే గట్ లోని పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
అలాగే దీనిలో ఉండే విటమిన్ సి మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుందని చెబుతున్నారు. కాగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉదయం నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తాగవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల ముడి ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కలిపి తాగాలి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి, మంటను తగ్గించడానికి సహాయపడుతుందట. అలాగే పుదీనా టీ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందట. ఈ టీ జీర్ణశయాంతర ప్రేగు కండరాలను సడలిస్తుందని చెబుతున్నారు. అలాగే కడుపు ఉబ్బరం, వాయువు నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుందట. అదేవిధంగా సోంపు గింజల్లో కామోద్దీపన లక్షణాలు ఉంటాయి. అలాగే సోంపు వాటర్ గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందట. అందుకే మీకు ఈ సమస్యలు ఉంటే ఉదయాన్నే సోంపు గింజలను వేడి నీటిలో నానబెట్టి తాగడం మంచిదని చెబుతున్నారు.