Radish: ముల్లంగి తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఫుడ్స్ ని అసలు తినకండి!
ముల్లంగి మంచిదే కానీ ముల్లంగి తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 03:30 PM, Thu - 5 September 24
మన వంటింట్లో దొరికే కాయగూరలలో ముల్లంగి కూడా ఒకటి. ఈ ముల్లంగి తో ఎన్నో రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. దీని వాసన కాస్త ఘాటుగాను, తిన్నప్పుడు కాస్త కారంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మంది ముళ్ళంగిని కూర రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ముల్లంగిని డైరెక్టుగా పచ్చిగా తింటూ ఉంటారు. ముల్లంగి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు పెట్టవచ్చని చెబుతున్నారు.
ముల్లంగిలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ముల్లంగిలో విటమిన్ ఎ, బి , సి, ప్రోటీన్, కాల్షియం , ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. చాలా మంది చలికాలంలో దీన్ని తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉన్న వారికి ముల్లంగిని తీసుకోవడం బాగా పనిచేస్తుంది. ముల్లంగిలో ఫంగల్ ఇన్ఫెక్షన్, మధుమేహం నిరోధించే పోషకాలు ఉన్నాయి. అధిక బీపీ, గుండె జబ్బులు, కడుపు సమస్యలను నయం చేస్తుంది. అంతే కాదు ముల్లంగి మీ కొవ్వును తగ్గిస్తుంది. మీకు ఎసిడిటీ అపానవాయువు సమస్యలు ఉంటే, మీరు ఖాళీ కడుపుతో ముల్లంగిని తినడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ముల్లంగి తినడం మంచిదే కానీ ముల్లంగి తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగకూడదట. ముల్లంగి శరీరంలో వేడిని సృష్టిస్తుంది. కాబట్టి ముల్లంగి తిన్న తర్వాత పాలు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లక్స్ కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే పాలు, ముల్లంగి తీసుకునే ముందు వాటి మధ్య కనీసం రెండు గంటలు సమయం వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా కీరదోసకాయ ముల్లంగి ఎప్పుడు కలిపి తినడం లేదంటే ఒకదాని తర్వాత ఒకటి తినడం లాంటివి అస్సలు చేయకూడదట. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదని చెబుతున్నారు. అదేవిధంగా ముల్లంగి తిన్న తర్వాత నారింజ అస్సలు తినకూడదట.
ఇది మిమ్మల్ని కడుపు సమస్యలకు రోగిని చేయడంతో పాటు మరిన్ని వ్యాధులను కూడా కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే ముల్లంగి తిన్న తర్వాత కాకరకాయను అసలు తినకూడదని చెబుతున్నారు. అలాగే ఈ రెండింటినీ కలిపి అసలు తినకూడదట. ఈ రెండిటిలో ఉండే సహజసిద్ధమైన అంశాలు ఒకదానితో ఒకటి సంకర్షణ చెంది మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఇది మీకు శ్వాస సమస్యలను కలిగిస్తుంది. అలాగే, ఇది గుండెకు ప్రాణాంతకం అని చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.