HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >These Are The Symptoms Of Vitamin D Deficiency In The Body

Vitamin D: శరీరంలో విటమిన్ డి లోపిస్తే…కనిపించే లక్షణాలు ఇవే..!!

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైంది. ఇది లోపిస్తే అనేక వ్యాధుల బారినపడతాం.

  • By hashtagu Published Date - 01:00 AM, Sun - 9 October 22
  • daily-hunt
Vitamin D
Vitamin D

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైంది. ఇది లోపిస్తే అనేక వ్యాధుల బారినపడతాం. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడటం, దంత వ్యాధులు వస్తాయి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఈ విటమిన్ లోపం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. విటమిన్ డి శరీరంలో కాల్షియంను తిరిగి నింపుతుంది. గణాంకాల ప్రకారం, దేశంలో 70 నుండి 90 శాతం మంది ప్రజలు ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.

విటమిన్ డి ఇతర విటమిన్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్‌గా పనిచేస్తుంది. దీని లోపం శరీరంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి విటమిన్ డి లోపం లక్షణాలు ఏమిటి ? దాని లోపాన్ని ఎలా అధిగమించవ్చో తెలుసుకుందాం.

విటమిన్ డి లోపం లక్షణాలు:
విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిజానికి చిన్నపాటి గాయం తర్వాత కూడా ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు శరీరంలో తిమ్మిరి సమస్య కూడా మొదలవుతుంది. ఒక నివేదిక ప్రకారం, BMI 30 కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు లేదా శరీరంలో కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటే, వారు కూడా దాని లోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎండలో ఉండే అవకాశం లేని వారు కూడా ఈ విటమిన్ డి సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వయస్సుతో పాటు, శరీరంలో విటమిన్ డి లోపం ఉంటుంది. దీంతో లేచి కూర్చోవడం కష్టంగా మారింది. మీకు ఎప్పుడూ జ్వరం, జలుబు ఉంటే విటమిన్ డి చాలా అవసరం. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

శరీరంలో విటమిన్ డి లోపాన్ని అధిగమించాలంటే:

పుట్టగొడుగు :
పుట్టగొడుగు అనేక విటమిన్లకు మూలం. ఇందులో విటమిన్ సి,విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. మార్కెట్‌లో కూడా సులభంగా దొరుకుతుంది. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.

పెరుగు :
ఇది విటమిన్ డి, కాల్షియం ప్రధాన మూలం. శరీరంలోని విటమిన్ల లోపాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణశక్తిని బలపరుస్తుంది.

చేపలు:
నాన్‌వెజ్‌ను ఇష్టపడే వారు తప్పనిసరిగా తమ ఆహారంలో చేపలను చేర్చుకోవాలి. విటమిన్ డి ఇందులో తగినంత మొత్తంలో లభిస్తుంది.

సూర్యరశ్మి:
సూర్యరశ్మి కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. మీరు క్రమం తప్పకుండా ఉదయం ఎండలో కూర్చోవాలి. ఇది విటమిన్ డి లోపాన్ని తొలగిస్తుంది.

ఓట్స్:
ఇందులో విటమిన్ డి, ఫైబర్ ఇందులో తగినంత మొత్తంలో ఉంటాయి. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • importance of vitamin d
  • vitamin d causes
  • vitamin d deficiency

Related News

Root Vegetables

Root Vegetables: చలికాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినాల్సిందే..!

భారతీయ ఆహారంలో ముఖ్య భాగమైన వెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్, ఇతర సల్ఫర్ సమ్మేళనాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

  • Brain Worms

    Brain Worms: మెదడులో పురుగులు రాకుండా ఉండాలంటే కూరగాయలను ఎలా కడగాలి?

  • Yoga Stretches

    Yoga Stretches: ఉదయం నిద్ర లేవగానే అలసట, ఒళ్లు నొప్పులా!? అయితే ఇలా చేయండి!

Latest News

  • India Womens WC Winner: భారత మహిళల చారిత్రాత్మక విజయం – తొలి వనితల వరల్డ్ కప్ టీమిండియాదే

  • Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!

  • Headache: మైగ్రేన్, తలనొప్పి స‌మ‌స్య వేధిస్తుందా? అయితే ఈ పొర‌పాట్లు చేయ‌కండి!

  • South Africa: భార‌త్ నిర్దేశించిన 299 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సౌతాఫ్రికా సాధించ‌గ‌ల‌దా?

Trending News

    • LVM3-M5 Launch : నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5(బాహుబలి) రాకెట్

    • IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?

    • 21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త‌.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!

    • Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్

    • Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd