Skipping benefits: రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఇవే.. వెంటనే మొదలు పెడతారు!
- By Anshu Published Date - 06:30 AM, Tue - 20 December 22

Skipping benefits: ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్ చేసే వారు చాలా మంది ఉంటారు. శరీరం దృఢంగా ఉండాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత బిజీ జీవితాల్లో వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కొన్ని వస్తువులు తీసుకొని వాటితో వర్కవుట్ చేయడం లాంటివి చేస్తే శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో స్కిప్పింగ్ చేయడం ఒకటి. అద్భుతమైన ఏరోబిక్స్, కార్డియో వ్యాయామంగా స్కిస్పింగ్‌ను అభివర్ణిస్తారు. ఈజీగా చేసుకొనే వాటిలో ఇది ఉత్తమమైందని చెబుతారు. సులభమైన పద్ధతిలో శరీర బరువును నియంత్రించడానికి స్కిప్పింగ్ ఉపయోగపడుతుంది. స్కిప్పింగ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఆలోచన అవసరం లేదు. ఉన్న చోటే మీకు అనువైన పద్ధతిలో దీన్ని చేసుకోవచ్చు.
స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పదిలపర్చుకోవచ్చు. భవిష్యత్తులో గుండె జబ్బులు, పక్షవాతం లాంటివి రాకుండా స్కిప్పింగ్ వర్కౌట్ ఉపయోగపడుతుంది. స్కిప్పింగ్ చేయడం కోసం తొలుత కాస్త ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఒక సంఖ్య ఎంచుకొని రోజూ అన్ని సార్లు స్కిప్పింగ్ చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫోకస్ పెరుగుతుంది. శరీరానికి కూడా పటుత్వం చేకూరుతుంది. మనస్సు, శరీరం సామరస్యంగా ఉంటే, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
రక్తప్రసరణ సులభంగా జరిగేందుకు మార్గం..
స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. స్కిప్పింగ్ చేస్తున్న క్రమంలో కండరాలు చాలా తేలిగ్గా తయారవుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఎల్లప్పుడూ అలసిపోయినట్లు, గజిబిజిగా ఉన్నట్లయితే స్కిప్పింగ్ మంచి రిలీఫ్ ఇస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆడవారు తమ పొట్టను కరిగించుకోవడానికి స్కిప్పింగ్ ఓ ఆయుధంలా ఉపయోగించుకోవాలి. ఎముకల బలం కూడా పెరిగేందుకు స్కిప్పింగ్ దోహదపడుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం, కండరాల బలోపేతం ఇలా చాలా ప్రయోజనాలు స్కిప్పింగ్ వల్ల చేకూరుతాయి. కాబట్టి వెంటనే స్కిప్పింగ్ మొదలు పెట్టండి మరి.