Pig Heart -Patient Died : పందిగుండెను అమర్చుకున్న మరో వ్యక్తికి ఏమైందంటే..
Pig Heart -Patient Died : ఆరువారాల కిందటే (సెప్టెంబరులో) సర్జరీ ద్వారా పందిగుండెను అమర్చుకున్న అమెరికా వ్యక్తి లారెన్స్ ఫౌసెట్ చనిపోయాడు.
- By Pasha Published Date - 11:52 AM, Wed - 1 November 23

Pig Heart -Patient Died : ఆరువారాల కిందటే (సెప్టెంబరులో) సర్జరీ ద్వారా పందిగుండెను అమర్చుకున్న అమెరికా వ్యక్తి లారెన్స్ ఫౌసెట్ చనిపోయాడు. దీంతోమానవ గుండెను పందిగుండె సక్సెస్ ఫుల్‌గా రీప్లేస్ చేయలేదని మరోసారి తేలిపోయింది. తీవ్ర గుండె సమస్యను ఎదుర్కొన్న 58 ఏళ్ల లారెన్స్ ఫౌసెట్‌కు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన వైద్య నిపుణులు పంది గుండెను అమర్చారు. అనంతరం క్రమంగా అతడి ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. చివరకు ఈ సోమవారం సాయంత్రం చనిపోయాడు.
We’re now on WhatsApp. Click to Join.
గతేడాది (2022లో) మేరీల్యాండ్ వైద్యుల బృందం బాల్టిమోర్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే మరో వ్యక్తికి తొలిసారిగా పందిగుండెను అమర్చారు. ఈ గుండె మార్పిడి సర్జరీ చేసిన రెండు నెలల తర్వాత బెన్నెట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మానవ అవయవాల కొరత తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 2022లో కేవలం 4,100 గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గుండెతోపాటు ఇతర అవయవాల కోసం పెద్ద సంఖ్యలో బాధితులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో పందిగుండెతో గుండె మార్పిడి సర్జరీలను అక్కడి శాస్త్రవేత్తలు ట్రై చేశారు. అవి ఫెయిల్ (Pig Heart -Patient Died) అయ్యాయి.