Sugar: ఏంటి.. షుగర్ తింటే కాన్సర్ వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
షుగర్ తింటే నిజంగానే కాన్సర్ వస్తుందా,ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. షుగర్ ఎక్కువగా తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Mon - 26 May 25

ఇటీవల కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది సుగర్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు.. ముఖ్యంగా షుగర్ తో తయారు చేసిన స్వీట్లు,కేక్స్, చాక్లెట్స్ వంటివి ఎక్కువగా తింటున్నారు. అయితే సుఖదు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసునా కూడా చాలామంది మాత్రం వినిపించుకోకుండా ఎక్కువగా షుగర్ ని తీసుకుంటూ ఉంటారు. షుగర్ స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారట. ఇది క్రమంగా ఊబకాయానికి దారితీస్తుందని చెబుతున్నారు.
అధిక బరువు,ఊబకాయం వంటి సమస్యలు క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయట. స్వీట్స్ తినడం వల్ల శరీర జీవక్రియపై ఇది నెగిటివ్ గా ప్రభావం చూపిస్తుందట. అలాగే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ఆహారంలో చక్కెరను అధికంగా తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని, శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి క్యాన్సర్ కణాలను ప్రోత్సాహిస్తుందని చెబుతున్నారు. కాగా షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ లు వేగంగా వ్యాపిస్తాయట.
కాగా షుగర్ క్యాన్సర్ మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తెస్తుందని, అలాగే వృద్ధాప్య ఛాయలను పెంచుతుందని చెబుతున్నారు. అలాగే షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఆ పిల్లలకు పళ్ళు పుచ్చిపోవడం, కడుపు నొప్పి రావడం వంటి సమస్యలు కూడా వస్తాయట. కాబట్టి షుగర్ ను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు..