Chapathi Tips : మీకు తెలుసా ? చపాతీ అలా కాల్చితే క్యాన్సర్ రావొచ్చు..
చపాతీలు, పుల్కాలు నార్త్ ఇండియాలో ఎక్కువగా తింటారు. డైట్ పేరుతో.. ఈ మధ్య సౌత్ ఇండియాలోనూ ఎక్కువగా తింటున్నారు. చపాతీలు తింటే స్కిన్ హైడ్రేషన్ కాకుండా ఉంటాం. గోధుమ పిండితో చేసే చపాతీలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
- By News Desk Published Date - 08:47 PM, Fri - 23 February 24
Chapathi Tips : రాత్రి పూట చపాతీలను తింటే.. ఆరోగ్యానికి మంచిది. డైట్ కి కూడా బాగుంటుంది. అయితే చాలా మంది చపాతీలను డైరెక్ట్ గా గ్యాస్ మీద కాల్చుతారు. వీటినే పుల్కాలు అని కూడా అంటారు. ఇలా డైరెక్ట్ గా గ్యాస్ మంటపై కాల్చుకోవడం అస్సలు మంచిపద్దతి కాదు. గ్యాస్ పై చపాతీలను కాల్చితే.. చాలా రకాల ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
మనదేశంలో ప్రధానంగా తినే ఆహారంలో అన్నం, చపాతీ చాలా ముఖ్యమైనవి. కొందరు చపాతీని రకరకాలు చేసి తింటారు. కొందరు పాన్ పై కాల్చితే.. మరికొందరు నేరుగా గ్యాస్ పై కాల్చి తినేందుకు ఇష్టపడుతారు. ఇది చపాతీని త్వరగా, మెత్తగా చేస్తుంది. గ్యాస్ పై చపాతీ కాల్చడం త్వరగా అయిపోతుందని తింటే.. ఇది ఈ అలవాటు మీ ఆరోగ్యానికి హానికరం. కొన్ని రకాల వ్యాధులు త్వరగా వచ్చే ప్రమాదం ఉంది.
ఒక అధ్యయనంలో గ్యాస్ స్టవ్ ల నుంచి ఆరోగ్యానికి హాని కలిగించే వాయు కాలుష్యం విడుదలవుతుందని తేలింది. కాలుష్య కారకాలు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, శ్వాస, జీర్ణక్రియకు ప్రమాదాన్ని కలిగస్తాయి. అంతేకాదు.. క్యాన్సర్ కు కూడా కారణమయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మరో అధ్యయనం ప్రకారం.. అధికమంటపై చపాతీలను చేయడం శరీర అవయవాలకు మంచిది కాదని వెల్లడైంది. అవి కూడా క్యాన్సర్ కు కారణం కావొచ్చు. గ్యాస్ పై చేసిన చపాతీ తినడం ఎలా చూసినా ఆరోగ్యానికి హానికరమే.
చపాతీలు, పుల్కాలు నార్త్ ఇండియాలో ఎక్కువగా తింటారు. డైట్ పేరుతో.. ఈ మధ్య సౌత్ ఇండియాలోనూ ఎక్కువగా తింటున్నారు. చపాతీలు తింటే స్కిన్ హైడ్రేషన్ కాకుండా ఉంటాం. గోధుమ పిండితో చేసే చపాతీలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అలాగే బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతాయి. కానీ.. చపాతీలను డైరెక్ట్ గా గ్యాస్ పై కాల్చే అలవాటు ఉంటే మాత్రం.. మానుకోవాలి.
చపాతీలు తినడం డైట్ కు మంచిది కదా అని ఇష్టమొచ్చినట్లు తింటే.. అనారోగ్యం వస్తుంది. ఎక్కువగా కాలినా లేదా మాడిన ఆహార పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే పుల్కాలు, చపాతీలను నేరుగా గ్యాస్ పై కాల్చకూడదు. వీటిలో నుంచి వచ్చే మంటలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైయాక్సైడ్, సూక్ష్మమైన దుమ్ముకణాలు చాలా ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారాన్ని గ్రిల్ చేసేటపుడు కూడా పాలీఎక్రిలిక్, అరోమేటిక్ హైడ్రోకార్బన్స్, హెటిరోసైక్లిక్ అమైన్స్ వంటి హానికారకాలు విడుదలవుతాయి. ఇలా నేరుగా మంటపై కాల్చినవి తింటే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకున్నట్లు. జాగ్రత్త మరి.
Related News
Oats Chapati: మీరు ఎప్పుడైనా ఓట్స్ చపాతీ తిన్నారా.. తినకపోతే సింపుల్గా ట్రై చేయండిలా?
మామూలుగా మనము గోధుమపిండితో తయారు చేసిన చపాతీలను ఎక్కువగా తింటూ ఉంటాం. కొందరు చపాతీలు మరింత క్రిస్పీగా టేస్టీగా రావాలి అని అందులో