Sorghum : జొన్నలతో ఎన్ని ప్రయోజనలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
Sorghum : జొన్నల్లో ఉన్న అధిక మోతాదులో డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్దక సమస్యలను తగ్గించడమే కాకుండా, పొట్ట నిండిన భావనను కలిగించి అధిక భోజనం చేయకుండా అరికడతాయి
- By Sudheer Published Date - 07:20 AM, Wed - 18 June 25

జొన్నలు (Sorghum ) మన ఆహార సంస్కృతిలో ప్రధానమైన ధాన్యంగా పేరొందాయి. వాటిలో విటమిన్లు (విటమిన్ బి కాంప్లెక్స్), ఖనిజాలు (ఇనుము, ఫాస్పరస్, మెగ్నీషియం) సమృద్ధిగా లభ్యమవుతాయి. ఇవి శరీరానికి తగిన శక్తిని అందిస్తూ రోజువారీ పనుల్లో చురుకుదనాన్ని కలిగిస్తాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ జొన్న రోటీలు, జొన్న కాంచి వంటి వంటకాలు చేసుకుంటూ వారి ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటున్నారు.
Fibernet : ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ఏపీ ప్రభుత్వం
జొన్నల్లో ఉన్న అధిక మోతాదులో డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్దక సమస్యలను తగ్గించడమే కాకుండా, పొట్ట నిండిన భావనను కలిగించి అధిక భోజనం చేయకుండా అరికడతాయి. దీని వలన బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి జొన్నలు మంచివిగా మారతాయి. అలాగే, జొన్నల్ని నిత్యం తీసుకునే వారు టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయులు సమతుల్యతలో ఉంటాయి.
జొన్నల్లో ఉండే మాగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలను బలపరిచేందుకు ఉపయోగపడతాయి. అలాగే పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది హై బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యల నుంచి రక్షణనిచ్చే సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాకుండా, జొన్నల్లో ఉండే ఇనుము శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. దీంతో రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల జొన్నలు ఆరోగ్యానికి మేలు చేయడంలో అతి ముఖ్యమైన ఆహారంగా నిలుస్తున్నాయి.