Summer Season : వేసవిలో చర్మం రంగు మారుతుందా?
Summer Season : అలాగే సన్‌స్క్రీన్ లోషన్ (SPF 30 లేదా అంతకంటే ఎక్కువ) అప్లై చేయడం ద్వారా UV కిరణాల నుంచి రక్షణ పొందవచ్చు
- By Sudheer Published Date - 09:56 PM, Wed - 26 March 25

వేసవి కాలం(Summer Season)లో ఎండ తీవ్రంగా ఉండడంతో చర్మం నల్లబడటం అనేది చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. దీని ప్రధాన కారణం అల్ట్రావయొలెట్ (UV) కిరణాలు చర్మంపై ప్రభావం చూపించడం. ఈ కిరణాల కారణంగా మెలానిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మం ముదురు రంగులోకి మారడానికి దారితీస్తుంది. దీనిని టానింగ్ (skin tanning) అని పిలుస్తారు. ముఖ్యంగా చేతులు, ముఖం, మెడ వంటి భాగాలు ఎక్కువగా ఎండకి గురికావడం వల్ల వాటి రంగు మారిపోతుంది.
టానింగ్ నివారణ (skin tanning removal)
వేసవి కాలంలో ఫుల్ స్లీవ్ బట్టలు, కాటన్ దుస్తులు ధరించడం ద్వారా చర్మాన్ని ఎండ ప్రభావం నుంచి రక్షించుకోవచ్చు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్ (SPF 30 లేదా అంతకంటే ఎక్కువ) అప్లై చేయడం ద్వారా UV కిరణాల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతి రెండు గంటలకు ఒక్కసారి సన్‌స్క్రీన్ రాసుకోవడం ఉత్తమం. వీటితో పాటు కలబంద (Aloe Vera) జెల్ ముఖం, చేతులు, మెడపై అప్లై చేయడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచుకోవచ్చు.
నేచురల్ హోమ్ రెమెడీస్ (Natural Home Remedies)
ఎండ వల్ల కలిగిన టానింగ్ తొలగించడానికి ఇంటి చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. శనగపిండి, పసుపు, పాలు, తేనె, రోజ్ వాటర్, ముల్తాని మట్టి వంటి సహజ పదార్థాలతో ఫేస్ ప్యాక్ చేసుకొని ముఖం, చేతులు, మెడకు అప్లై చేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. రోజూ బాగా నీరు తాగడం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎండ వేడిమి వల్ల చర్మం పొడిబారకుండా ఉండేందుకు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం, మాయిశ్చరైజర్ వాడటం కూడా చాలా అవసరం.