Chia Seeds: సబ్జా గింజలు అతిగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. సబ్జా గింజలను చియా సీడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి
- By Nakshatra Published Date - 05:45 PM, Thu - 1 June 23
సబ్జా గింజల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. సబ్జా గింజలను చియా సీడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి చూడటానికి ఆవాల మాదిరిగా ఉండి నల్లటి రూపంలో ఉంటాయి. వీటిని నీళ్లలో నానబెట్టిన తర్వాత కాస్త లావుగా ఉబ్బుతాయి. ఇతర కాలంతో పోల్చుకుంటే వేసవికాలంలో సబ్జా గింజలను ఎక్కువగా తింటూ ఉంటారు. వేసవిలో నానబెట్టిన సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
అయితే సబ్జా గింజలు మంచివే కానీ మితిమీరి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి సబ్జా గింజలు అతిగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సబ్జా గింజలను ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. చియా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే వాటిని సరిగ్గా జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. రోజులో సబ్జా విత్తనాలను ఒక మోతాదు వరకే తీసుకోవాలి. అంతకుమించి తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
అలాగే చియా విత్తనాలను అతిగా తీసుకోవడం వల్ల విరేచనాలు, ఉబ్బరం, స్టమక్ క్రాంప్స్ వంటివి వస్తాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. సబ్జా గింజల్లో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లకు రక్తాన్ని పలుచన చేసే లక్షణాలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో సబ్జా విత్తనాలను రోజూ తీసుకుంటే రక్తపోటు సమస్యలు వస్తాయి. ఒకవేళ బీపీ మందులను తీసుకునేవారైతే సబ్జా గింజలను తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చక్కెర ను గ్రహించే గట్ సామర్థ్యాన్ని ఆటంకపరుస్తాయి. దాని వల్లల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. సబ్జా గింజల్లోని ఈ గుణాలు డయాబెటిస్ ఉన్న వారికి, ఇప్పటికే మందులు, ఇన్సులిన్లు తీసుకుంటున్న వారికి సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే సబ్జా విత్తనాలను మోతాదుకు మించి తీసుకోవద్దు.
Related News
Laptop Side Effects: ల్యాప్‌టాప్‌ను తెగ వాడేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ రావొచ్చు..!
ఈరోజుల్లో చాలా మంది ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే వెంటనే ల్యాప్ టాప్ సాయంతో చేసేస్తున్నారు.