Apple: మంచిదే కదా అని యాపిల్ పండ్లను ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!
యాపిల్ పండ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని ఎక్కువగా తినకూడదట.
- By Nakshatra Published Date - 01:30 PM, Mon - 2 September 24
యాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక యాపిల్ ని తీసుకుంటే చాలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు అని అంటూ ఉంటారు. అయితే యాపిల్ పండు ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మరి యాపిల్ పండును ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆపిల్ పండ్లలో పొటాషియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
వీటిని అతిగా తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. యాపిల్ లో పోషకాలు ఔషధంలా పనిచేస్తాయి. అయితే యాపిల్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. యాపిల్ పండును ఎక్కువగా తింటే జీర్ణక్రియ దెబ్బతింటుందట. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే అతిగా తింటే గ్యాస్ సమస్య వస్తుంది. దీనివల్ల కడుపునొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే యాపిల్స్ లో పొటాషియం, ఫైబర్, ఐరన్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట.
పురుగు మందులు ఆపిల్స్ లో కూడా కనిపిస్తాయి. దీనిలో డిఫెనిలామైన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. దీనిని యూరోపియన్ యూనియన్ కూడా నిషేధించింది. ఆపిల్స్ ను ఎక్కువగా తినడం వల్ల అలెర్జీ వస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మీకు ఆపిల్స్ ఎంత ఇష్టమైనా వీటిని మరీ ఎక్కువగా తినడం వల్ల మీ బరువు ప్రభావితం అవుతుందట. ఆపిల్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు బరువు పెరుగుతారు. ఒక చిన్న ఆపిల్ లో 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు,5 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
దీంతో మీరు అతిగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. ఎందుకంటే దీనివల్ల మీ శరీరం ఎక్కువ కొవ్వును కరిగించలేకపోతుంది. కాబట్టి యాపిల్ ని తక్కువగా తీసుకోవడమే మంచిది. సోడా కంటే ఆపిల్స్ ఎక్కువ ఆమ్లంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే దంత సమస్యలు వస్తాయి. ఆపిల్స్ ను ఎక్కువగా తింటే మీ దంతాలు దెబ్బతింటాయి. ఇది మీ దంత ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రతిరోజు యాపిల్ ని తినాలి అనుకుంటే నార్మల్ సైజులో ఉండే రెండు యాపిల్ పండ్లను తినవచ్చు అని చెబుతున్నారు.
mote: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి..
Related News
Airtel – Apple : ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సేవలు
భారత్‌లో హైక్వాలిటీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకే యాపిల్‌తో ఎయిర్ టెల్ జట్టు కట్టిందని సమాచారం.