Banana: బాబోయ్.. అరటి పండ్లు ఎక్కువగా తినడం అంత డేంజరా?
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవని, ఇది అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. మరి అరటి పండ్లు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 13-05-2025 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
అరటిపండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయట. ఏడాది పొడవునా తక్కువ ధరకే లభించే పండ్లలో అరటి పండ్లు మొదటి స్థానంలో ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ అరటి పండును ఇష్టపడే తింటూ ఉంటారు. అరటిపండును తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవట. అరటిపండు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉందట. అరటిపండ్లలో సహజంగానే ఫ్రక్టోజ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయట. అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుందట. అరటి పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువ అవుతాయని, దీంతో గుండె, మూత్ర పిండాలపై ఒత్తిడి పెరుగుతుందని గుండె, కిడ్నీల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. అరటిపండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయట.
అరటి పండ్లు ఎక్కువగా తింటే సైనస్ సమస్య పెరుగుతుందట. దీనివల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉందట. అరటిపండ్లు ఎక్కువగా తింటే తలనొప్పి వస్తుందట. ఇప్పటికే తలనొప్పి ఉంటే అరటిపండ్లు తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. అరటిపండ్లలో ప్రోటీన్ ఉండదు. అతిగా తింటే కండరాలు బలహీనపడతాయట. అరటి పండులో విటమిన్ బి6 ఉంటుంది. కాబట్టి అరటి పండును ఎక్కువగా తినడం వల్ల శరీరానికి విటమిన్ బి6 అందుతుందట. అయితే, విటమిన్ బి6 ఎక్కువైతే నరాలకు ముప్పు కలిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు నరాల బలహీనత, తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని కాబట్టి అరటి పండ్లను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అరటిపండ్లు తినాలి అనుకున్న వారు రోజుకు రెండు కంటే ఎక్కువగా తినకూడదట.