Sesame Seeds – Periods : పీరియడ్స్ రెగ్యులర్ కావాలంటే ఇవి తినండి !
Sesame Seeds - Periods : నువ్వులలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే లడ్డూల నుంచి చక్లీల వరకు అన్నింటిలో నువ్వులను ఉపయోగిస్తారు.
- By Pasha Published Date - 07:35 PM, Fri - 5 January 24

Sesame Seeds – Periods : నువ్వులలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే లడ్డూల నుంచి చక్లీల వరకు అన్నింటిలో నువ్వులను ఉపయోగిస్తారు. వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వేడి చేసే గుణం నువ్వులకు ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి. ఈ సమస్యను పోగొట్టడానికి నువ్వులు బాగా పనికొస్తాయి. నువ్వులను తింటే పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయి. నువ్వుల వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
- చలికాలంలో 1 టీస్పూన్ నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులను తీసుకుంటే.. రుతుక్రమం క్రమం తప్పకుండా ఉంటుంది. సమ్మర్ సీజన్‌లో మాత్రం నువ్వులను నానబెట్టి తీసుకోవాలి.
- నువ్వులను మితంగా తింటే శరీరంలో రక్త ప్రవాహం కంట్రోల్‌లోకి వస్తుంది. ఫలితంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తొలగిపోతుంది. ఒకవేళ పీరియడ్స్ త్వరగా రావడానికి నువ్వులను వాడితే హాని కలిగే రిస్క్ ఉంటుంది. నువ్వులలో ఉండే జింక్, ఐరన్ శరీరంలోని ఎర్ర రక్త కణాల పరిమాణాన్ని పెంచుతాయి.
- నువ్వుల్లోని జింక్ మన శరీరంలో ప్రొజెస్టెరాన్ లెవల్‌ను పెంచుతుంది. నువ్వులలో లిగ్నన్లు అని పిలిచే ఫైబర్ అధికంగా ఉండే సమ్మేళనాలు ఉంటాయి. రుతుస్రావం 15 వ రోజు నుంచి 28వ రోజు మధ్యలో ఉన్నప్పుడు నువ్వులు తింటే పీరియడ్ చక్రం కంట్రోల్ లోకి వస్తుంది.
- నువ్వులు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టడానికి సహాయపడతాయి. నువ్వుల్లోని విటమిన్ సీ వల్ల బాడీలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. ఈస్ట్రోజెన్ పెరిగితే గర్భాశయం సంకోచం కావడం పెరుగుతుంది. ఇది రక్తస్రావానికి కారణమవుతుంది.
- పీరియడ్ సైకిల్ అనేది హార్మోన్ల మార్పుల ద్వారా ప్రభావితమయ్యే ప్రక్రియ. ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు నువ్వుల్లో లభిస్తాయి. రుతుచక్రం క్రమం సవ్యంగా లేకుంటే నిపుణులను సంప్రదించిన తర్వాతే నువ్వులను తినాలి.
Also Read: Bharati Cements : రూ.150 కోట్ల ఎఫ్‌డీలపై భారతీ సిమెంట్స్‌కు ‘సుప్రీం’ షాక్
గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.