HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >People Who Should Not Eat Okra

Okra Benefits: బెండకాయ మంచిదే కానీ పొరపాటున కూడా వీళ్ళు బెండకాయ అస్సలు తినకూడదట..!

బెండకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా అసలు తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 10-02-2025 - 4:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Okra Benefits
Okra Benefits

కూరగాయల్లో ఒకటైన బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు బెండకాయని ఇష్టంగా తింటే మరికొందరు అసలు తినడానికి ఇష్టపడరు. ఇంకొందరు మాత్రం పచ్చిగా తినేస్తూ ఉంటారు. బెండకాయ ను ఉపయోగించి వేపుడు పచ్చడి పులుసు ఇలా చాలా రకాలు వంటలు తయారు చేస్తూ ఉంటారు. బెండకాయతో ఎలాంటి రెసిపీ తయారు చేసిన సూపర్ గా ఉంటుందని చెప్పవచ్చు. బెండకాయ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నిషియం, విటమిన్ బి, మాంగనీస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి.

బెండకాయలో కాల్షియం, విటమిన్ కె ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయట. అలాగే ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయట. దీంతో క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బెండకాయ కొందరికి మాత్రం మంచిది కాదట. కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు బెండకాయను తినకపోవడం మంచిదని చెబుతున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం… జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బెండకాయలు తినకూడదట. ఎందుకంటే బెండకాయ తినడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందట. అలర్జీ సమస్యతో బాధపడే వారు కూడా బెండకాయకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. చర్మంపై దద్దుర్లు, స్కిన్ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండాలట. వీళ్లు పొరపాటున కూడా బెండకాయను తినకూడదని చెబుతున్నారు. ఇప్పటికే అలెర్జీ సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినడం వల్ల మీ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందట. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు బెండకాయలను ఎక్కువగా తీసుకోకూడదట. బెండకాయల్లో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువ అయితే అవి కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయి. అందుకే ఇప్పిటికే కిడ్నీలో రాళ్ల సమస్యలు బాధపడుతున్నవారు బెండకాయలు తినకూడదని చెబుతున్నారు. అదేవిధంగా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినకూడదట.

ఎందుకంటే బెండకాయలో కాల్షియం ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మోకాళ్లలో నొప్పి, వాపును కలిగిస్తుందట. చలికాలంలో బెండకాయ తింటే ఈ సమస్యలు ఎక్కువగా మారతాయట. అందుకే ఈ సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటమే మేలు అని చెబుతున్నారు.. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలట. వీరితో పాటుగా రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న వారు డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కూడా బెండకాయను ఎక్కువగా తినకూడదని,ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • lady finger
  • okra
  • okra benefits

Related News

Struggling with work stress? Here’s how to relax!

Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువైతే రోగాలు వస్తాయని, ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇంటి ను

  • Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

    Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

  • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

  • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

  • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

  • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd