HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Ozempic How The Venom Of A Lizard Paved Way For Popular Diabetes Drug

Lizard Venom VS Diabetes : షుగర్ ఔషధాలకు విషపూరిత బల్లులతో లింక్.. ఏమిటి ?

GLP-1 అనేది ఒక హార్మోన్. ఇది మనిషి శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయులను(Lizard Venom VS Diabetes) నియంత్రిస్తుంది. 

  • By Pasha Published Date - 11:22 AM, Mon - 24 February 25
  • daily-hunt
Lizard Venom Vs Diabetes Ozempic Diabetes Drug Diabetes Obesity

Lizard Venom VS Diabetes : మనకు డయాబెటిస్ (షుగర్) గురించి బాగా తెలుసు. నిత్యం ఎంతోమంది షుగర్ వ్యాధి బారినపడుతున్నారు.  కానీ చాలామందికి ‘గిలా మాన్‌స్టర్’(Gila monster)  గురించి తెలియదు. గూగుల్‌లో లేదా యూట్యూబ్‌లో ఈ పదం టైప్ చేసి చూడండి మీకే తెలుస్తుంది. దాన్ని చూసి పాము అనుకునేరు. అది బల్లి. పెద్దసైజులో ఉంటుంది అంతే. అమెరికాలోని ఎడారి ప్రాంతాల్లో చాలా అరుదుగా ఈ బల్లులు కనిపిస్తుంటాయి. ‘గిలా మాన్‌స్టర్’ బల్లులు విషపూరితమైనవి. అవి కాటేస్తే మనిషి బతకలేడు. అలాంటి బల్లులకు డయాబెటిస్ వ్యాధితో లింక్ ఉంది. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Shashi Tharoor: శశి థరూర్ ఏం చేయబోతున్నారు ? ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ?

‘గిలా మాన్‌స్టర్’ బల్లుల్లో ఏముంది ? 

  • ‘జీఎల్‌పీ-1’ అనే పదానికి ఫుల్ ఫామ్ ‘గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1’. కొన్ని షుగర్ మాత్రలపై  GLP-1 అని రాసి ఉండటాన్ని మనం చూస్తుంటాం.
  • GLP-1 అనేది ఒక హార్మోన్. ఇది మనిషి శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయులను(Lizard Venom VS Diabetes) నియంత్రిస్తుంది. 
  • టైప్-2 షుగర్(డయాబెటిస్), ఒబెసిటీ సమస్యల చికిత్సలో GLP-1తో కూడిన ఔషధాలను వైద్యులు ఇస్తుంటారు.
  • ‘గిలా మాన్‌స్టర్’ బల్లుల విషంలోనూ GLP-1 హార్మోన్ తరహా ప్రొటీన్ ఉంటుందని శాస్త్రవేత్తలు గతంలోనే  గుర్తించారు.
  • కెనడాకు చెందిన ప్రముఖ ఎండో క్రైనాలజిస్ట్ డేనియల్ డ్రక్కర్ షుగర్ ఔషధాలపై బాగా రీసెర్చ్ చేశారు. ఈక్రమంలో గతంలో ఇదే అంశంపై రీసెర్చ్ చేసిన పలువురి అధ్యయన నివేదికలను ఆయన చదివారు.  మనిషి శరీరంలోని జీఎల్‌పీ-1 హార్మోన్ తరహా ప్రొటీన్ ఒకటి ‘గిలా మాన్‌స్టర్’ విషంలో ఉందని అందులో ఉండటాన్ని డ్రక్కర్ గుర్తించారు.  తదుపరిగా గిలా మాన్‌స్టర్ బల్లులపై ఆయన లోతుగా రీసెర్చ్ మొదలుపెట్టారు.

Also Read :Kash Patel Vs Elon Musk : అమెరికా సర్కారులో ‘మస్క్’ దుమారం.. పెదవి విరిచిన కాష్ పటేల్

  • అమెరికాలోని ఉతా రాష్ట్రంలో ఉన్న ఒక జూ నుంచి ఓ గిలా మా‌న్‌స్టర్‌ను తీసుకొచ్చి ఎండో క్రైనాలజిస్ట్ డేనియల్ డ్రక్కర్ పరిశోధనలు చేశారు.
  • గిలా మా‌న్‌స్టర్‌ జన్యువులు ‘ఎగ్జెండిన్ -4’(Exendin-4) అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఈ రీసెర్చ్‌లో గుర్తించారు.  ఆ ప్రొటీన్ అచ్చం మనిషి శరీరంలోని  జీఎల్‌పీ-1 (GLP-1) హార్మోన్‌లా ఉందని తేలింది.
  •   తదుపరిగా అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి పొంది గిలా మా‌న్‌స్టర్‌‌లో ఉత్పత్తి అయ్యే  ‘ఎగ్జెండిన్ -4’(Exendin-4) ప్రొటీన్‌ను ఉపయోగించి GLP-1 సింథటిక్ వర్షన్‌ను డేనియల్ డ్రక్కర్  తయారు చేశారు.
  • ఇలా తయారైన GLP-1 సింథటిక్ వర్షన్‌ను టైప్2 డయాబెటిస్ రోగులకు, ఒబెసిటీ బాధితులకు ఇచ్చేందుకు 2005లోనే అనుమతులు మంజూరయ్యాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • Diabetes Drug
  • Lizard Venom
  • Lizard Venom VS Diabetes
  • obesity
  • Ozempic

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd