HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Overusing Pain Killers But This Main Organ Is Threatened

Painkillers: పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఇటీవల కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఒళ్ళు నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకు గల కారణం ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చ

  • Author : Anshu Date : 15-09-2023 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Painkillers
Painkillers

ఇటీవల కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఒళ్ళు నొప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకు గల కారణం ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. వెన్ను నొప్పి,కాళ్ళ నొప్పి , తలనొప్పి, శరీరంలో కండరాల నొప్పులు వచ్చినప్పుడు చాలామంది వైద్యుని సంప్రదించడానికి బదులుగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఇలా నొప్పి నివారణ మందులను వాడడం వల్ల ఆరోగ్యం పై దీర్ఘకాలంలో ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పెయిన్ కిల్లర్లు రెండు రకాలు. ఒకటి పారాసిటమాల్ ఆధారంగా తయారైనవి. ఇక మిగతావి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు. ఇవి చాలా సులభంగా అందుబాటులో దొరుకుతున్నాయి.

అందుకే వీటిని వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు ఒక గ్రాము కన్నా ఎక్కువ పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. ఒక గ్రాము పారాసిటమాల్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం నేరుగా కాలేయం పైనా, మూత్రపిండాల పై పడుతుంది. ఒక గ్రాము పారాసిటమాల్ పెయిన్ కిల్లర్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు చేసేంత హానిని కలిగించవు. కానీ దీనిని కూడా ఎక్కువ కాలం పాటు తీసుకోకూడదు.
ఇక నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటే. కాలేయానికి గాయం కావడం, పొట్టలో పుండ్లు ఏర్పడడం, గ్యాస్ట్రిక్, అల్సర్లు రావడం, మూత్రపిండాలు తీవ్రంగా నష్టపోవడం వంటి సమస్యలు వస్తాయి.

అలాగే ఇవి మీ అన్నవాహిక దిగువ భాగాన్ని చీల్చే అవకాశం ఉంది. ఈ మందులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం పాటు తీసుకుంటే మూత్రపిండాలు శాశ్వతంగా నష్టపోవచ్చు. కాలేయం ఉండే భాగంలో నొప్పి వస్తుంది. కాలేయం సరిగాప పనిచేయకపోవడం వల్ల కాలేయం విడుదల చేసే ఎంజైమ్స్, బిలిరుబిన్ పెరుగుతాయి. కాలేయ పనితీరు తగ్గడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్య పెరుగుతుంది. కాలేయం రక్తం గడ్డకట్టే కారకాన్ని అధికంగా విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నట్లయితే మీకు సాధారణం కంటే చాలా తక్కువ మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇది ఎంతో సమస్యగా మారుతుంది. శ్వాస ఆడక పోవడం, నడుస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి కష్టపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పొట్టలో నొప్పి అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు వేధిస్తుంది. దగ్గినప్పుడు రక్తం కూడా పడవచ్చు. అలాగే రక్తపు వాంతులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, వైద్యుని సంప్రదించాలి. అంతే కానీ మీకు ఇష్టం వచ్చిన విధంగా ఇలాంటి టాబ్లెట్స్ ఉపయోగించడం వల్ల పైన చెప్పిన విధంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health problems
  • organ
  • over use Painkillers
  • Painkillers
  • Painkillers problems

Related News

Do you have a habit of going to bed late at night? You could be at risk!

Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd