Mosambi: ఏంటి బత్తాయి కాయలు తింటే ఎక్కువగా అన్ని సమస్యలు దూరం అవుతాయా?
బత్తాయి కాయలను ఆ సమస్యలు ఉన్నవారు కూడా ఎటువంటి భయం లేకుండా తినవచ్చును చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 PM, Wed - 31 July 24

బత్తాయి కాయలు.. వీటిని ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కొందరు చీనీ కాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందడంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ కూడా తగ్గిపోతాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా బత్తాయిని తీసుకోవడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బత్తాయి కాయలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. బత్తాయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా వరకూ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. దీంతో హ్యాపీగా వీటిని తీసుకోవచ్చు. అదే విధంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అలర్జీలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే బత్తాయి ని తీసుకోవడం వల్ల చాలా వరకూ అలర్జీలు తగ్గిపోతాయట. డయాబెటిస్ ఉన్నవారు జ్యూస్ తాగడం వల్ల ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకున్న వారికి కూడా ఇవి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. బత్తాయిల్లో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. దీని వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. బత్తాయిలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసం ఇందులోని విటమిన్ సి, ఫైబర్ హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తినాలని చెబుతున్నారు.