Vitamins: వీటిని ఆహారంలో తీసుకుంటే…ఏ వేరియంట్ ఏం చేయదు..!
ఆరోగ్యం విలువ వైరస్ వచ్చాక మనకు తెలిసింది. రక్షణ వ్యవస్ధ బాగా ఉంటే వైరస్ వల్ల ఆసుపత్రుల పాలవ్వకుండా సులువుగా బయటపడవచ్చు.
- By Hashtag U Published Date - 11:27 AM, Wed - 26 January 22

ఆరోగ్యం విలువ వైరస్ వచ్చాక మనకు తెలిసింది. రక్షణ వ్యవస్ధ బాగా ఉంటే వైరస్ వల్ల ఆసుపత్రుల పాలవ్వకుండా సులువుగా బయటపడవచ్చు. వైరస్ రూపాంతరం చెందుతూ పలు రకాల వేరియంట్లుగా వస్తూనే ఉంది. కానీ మనం వాటి నుంచి బయటపడాలంటే రక్షణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయాలి. రక్షణ వ్యవస్థకు ఆయుధాలాంటి పోషకాలను మనం నిత్యం అందిస్తుండాలి. రక్షణ వ్యవస్థ బాగుండాలంటే అన్నికంటే ముఖ్యంగా పోషకాలతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.
శరీరానికి అవసరమయ్యే పోషకాలు విటమిన్, ఏ, బి, సి, డి, ఈ…ఈ ఐదు విటమిన్స్ అందించినట్లయితే రక్షణ వ్యవస్థకు ఆయుధాలు మనం సమకూర్చినట్లు అవుతుంది. ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలను జోడించడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఆకూకూరల్లో ఉండే బీటా కెరోటిన్ మనశరీరంలో విటమిన్ ఏగా మారి శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ను అందేలా చేస్తుంది.
ఇక క్యారేట్, టమాటో, కీరదోస, కరివేపాకు, కొత్తిమీర వేసి జ్యూస్ చేసుకుని తాగినట్లయితే విటమిన్ ఏ లభిస్తుంది. ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల బి కాంప్లెక్స్ విటమిన్లు లభిస్తాయి. మొలకెత్తిన గింజలలో కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకు రెండు జామకాయలు తిన్నట్లయితే విటమిన్ సి లభిస్తుంది. అంతేకాదు ఉదయం పూట ఎండలో గంటసేపు గడిపినట్లయితే విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నట్లయితే వైద్యుల సలహా మేరకు నెలకోసారి విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవడం మంచిది.
వీటన్నింటితోపాటుగా గింజలు, బాదం, పొద్దు తిరుగుడు గింజలలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ ఈ ఐదు రకాల విటమిన్స్ ఉండే ఆహారం తీసుకున్నట్లయితే శరీరంలో రక్షక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒమిక్రాన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో రక్షక వ్యవస్థకు విటమిన్ ఏ, బి, సి, డి, ఈ చాలా సహాయపడతాయి.
ఈ విటమిన్స్ ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ ఆహారంలో తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి కోవిడ్ లాంటి ఎన్ని వేరియంట్స్ వచ్చినా….మనకు వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది.