Health Tips: బయట ఫుడ్ మాత్రమే కాదండోయ్ ఇంటి ఫుడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసా?
ICMR ప్రకారం కేవలం బయట చేసిన ఫుడ్డు మాత్రమే కాకుండా ఇంట్లో చేసిన ఫుడ్డు కూడా ఆరోగ్యానికి అసలు మంచిది కాదట.
- By Anshu Published Date - 06:00 PM, Tue - 30 July 24

ప్రస్తుతం మనం కల్తీ ప్రపంచంలో బతుకుతున్నాం అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనం తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు ప్రతి ఒక్కటి కూడా కల్తీదే. తినే ఆహార పదార్థాలలో కల్తీ, తాగే నీటిలో కల్తీ, చివరికి మనం పీల్చే గాలిలో కూడా కల్తీ. ఇలా ప్రతి ఒక్కటి కూడా కల్తీ కావడంతో ప్రజలు అనేక రకాల కొత్త కొత్త అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దానికి తోడు ఈ మధ్యకాలంలో చాలా వరకు కుటుంబ సభ్యులు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్నే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మీకు తెలుసా కేవలం బయట దొరికే ఫుడ్ మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే ఫుడ్డు కూడా కల్తీనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంటి ఫుడ్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు.
మరి ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఇంట్లో ఫుడ్ ఆరోగ్యకరం అని అనుకుంటారు. కానీ చేసే విధానం సరిగా లేకపోతే ఇంట్లో చేసినా కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన ఆహారంలో కొవ్వు, చక్కెర లేదా ఉప్పు ఎక్కువగా ఉంటే అనారోగ్యకరమైనది. ఆహారంలో నెయ్యి లేదా వెన్న వంటి సంతృప్త కొవ్వుల వినియోగానికి వ్యతిరేకంగా ICMR హెచ్చరిస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, పీచుతో కలిపితేనే కేలరీలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అయితే కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు అధికంగా ఉండే ఆహారాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు సూక్ష్మ పోషకాలు, పీచు పదార్థాలు తక్కువగా ఉంటాయట. ఆహారంలో కొవ్వు , చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు, వాటిలో ఎక్కువ కేలరీలు ఉంటాయట.
ఇది ఊబకాయం వంటి పరిస్థితులకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఆహారంలో అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు , సూక్ష్మపోషకాలు లేకపోవడం రక్తహీనత వంటి పరిస్థితులకు దారి తీస్తుందట. ఇది క్రమం గా మెదడు పనితీరు, అభ్యాస సామర్థ్యం , జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుందని, టైప్ 2 డయాబెటిస్ ఊబకాయం వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక కొవ్వు లేదా అధిక చక్కెర ఆహారాలు మంటను కలిగిస్తాయి. గట్ మైక్రోబయోటాను ప్రభావితం చేస్తుందట. ఉప్పు అధికంగా ఉండే ఆహారం అధిక రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ఆహారంలో అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు , సూక్ష్మపోషకాలు లేకపోవడం రక్తహీనత వంటి పరిస్థితులకు దారితీస్తుందని చెబుతున్నారు.
అదేవిధంగా ఇంట్లో వండిన ఆహారంలో ఉప్పు లేదా పంచదార లేదా కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ, ఇందులో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, పామాయిల్ , కూరగాయల నూనె వంటి ఆహారాలు కూడా సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయట..రోజుకు 2000 కిలో కేలరీలు తీసుకునే ఆహారంలో రోజుకు 10 గ్రాముల కంటే ఎక్కువ సంతృప్త కొవ్వు అనారోగ్యానికి దారితీస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇంట్లో చేసుకునే ఆహారం కూడా సరిగా చేసుకోకపోతే అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.