Liver Disease: జాగ్రత్త…ఆల్కాహాల్ తీసుకోనివారిలోనూ ఫ్యాటీ లివర్ జబ్బులు..లక్షణాలు ఇవే..!!
ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో కాలేయ వ్యాధులు అనేవి సర్వసాధారణం. కానీ కొంత మోతాదులో మద్యం తీసుకునేవారిలోనూ...మద్యం అస్సలు ముట్టనివారిలోనూ ఫ్యాటీ లివర్ పరిస్థితి ఏర్పడుతుంది.
- By hashtagu Published Date - 12:37 PM, Thu - 14 July 22
ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో కాలేయ వ్యాధులు అనేవి సర్వసాధారణం. కానీ కొంత మోతాదులో మద్యం తీసుకునేవారిలోనూ…మద్యం అస్సలు ముట్టనివారిలోనూ ఫ్యాటీ లివర్ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. NAFLDప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే కాలేయ వ్యాధి. అసలు ఈ వ్యాధి లక్షణాలు తమలో ముదురుతున్నాయన్న విషయం చాలా మంది గుర్తించలేరు. ప్రారంభ దశలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడమే దీనికి కారణం.
ఒక లక్షణం ద్వారా దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిస్సత్తువగా ఉంటే NAFLD లక్షణాల్లో ఒకటిగా భావించాల్సి ఉంటుంది. ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసట వీడకపోవడం, బద్ధకంగా ఉండటం కాలేయ వ్యాధికి సంకేతాలు అట. ఉదయాన్నే నీరసంగా ఉంటే దైనందిత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చదువు, ఉద్యోగం ఇలా ఏదైనా కావచ్చు. ఆయా అంశాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. అంతేకాదు మానసిక సంతులనం కోల్పోతారు. చిరాకు వంటి నెగెటివ్ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని NAFLD ప్రారంభ లక్షణాలుగా భావించి వైద్యుడ్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరో లక్షణంఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివన్ ను సూచిస్తుంది. పొట్టకు కుడివైపున పై భాగంలో తరచుగా నొప్పి వస్తుంటే అది ఫ్యాటీ లివర్ ప్రభావం కావొచ్చు. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే..నాన్ ఆల్కహాలిక్ స్టీటోహైపటైటిస్ కు దారితీస్తుంది. దీంతో తీవ్రస్థాయిలో కాలేయవాపు సంభవిస్తుంది. ఇది క్రమేణా సిర్రోసిస్ కు దారితీసి లివర్ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది. శరీరంలో అదనపు కొవ్వు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఈ ఫ్యాటీ లివర్ నివారణ మార్గాల్లో ప్రధానమైంది. బరువు తగ్గడంతో శరీరంలో కొవ్వు కణాల పెరుగుదలను తగ్గించవచ్చు. దైనందిన ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లు తీసుకోవడంతోపాటుగా ఆలివ్ నూనె లేదంటే ఆవ నూనెతో చేసిన వంటకాలను తినాలి. రోజూ ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేయడం ద్వారానూ కాలేయంలో కొవ్వు పేరుకుపోయినా కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
Related News
Food Poisoning: అలర్ట్.. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలివే..!
ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక సాధారణ సమస్య. ఇది కలుషితమైన ఆహారం లేదా పానీయాల వినియోగం వల్ల సంభవిస్తుంది.