HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Natural Immunity Boosters For Cold And Flu Warm Winter Drinks

Natural Immunity Boosters: జలుబు, దగ్గు,ముక్కు దిబ్బడతో ఊపిరి ఆడడం లేదా.. అయితే వెంటనే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

దగ్గు జలుబు సమస్యలు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నప్పుడు తప్పకుండా కొన్ని రకాల చిట్కాలను పాటించాలని, వాటి వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 22-01-2025 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Natural Immunity Boosters
Natural Immunity Boosters

ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామందిని దగ్గు జలుబు ముక్కుదిబ్బడ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యల కారణంగా చాలా మంది నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. జలుబు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఇక దగ్గుతో ఛాతి మొత్తం నొప్పిగా మంటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దగ్గు, జలుబును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగించడంతోపాటు ఆయుర్వేద చిట్కాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు కూడా అలా దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా. అయితే అలాంటప్పుడు ఏం చేస్తే వాటి నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని బాగా పుక్కిలించాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ విధంగా చేయాలి. ఇలా చేస్తే దగ్గు కంట్రోల్ అవ్వడంతో పాటు నోరులోనే బ్యాక్టీరియా కూడా క్లీన్ అవుతుంది.

అలాగే నిమ్మరసం తేనే కలిపి సమానంగా తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుముఖం పడతాయట. దీనిలో ఉండే యాక్టివిటీ బ్యాక్టీరియా లక్షణాలు గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే నిమ్మరసంలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసాన్ని, తేనెను నేరుగా తీసుకున్నా గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయట.

అలాగే అల్లంతో చేసిన టీను తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చట. రోగనిరోధక శక్తి పెరుగుతుందట. దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు దగ్గు, జలుబు, గొంతు సమస్యలను దూరం చేస్తాయి. అల్లాన్ని టీలో వేసుకుని తీసుకున్నా లేదా అల్లం ముక్కలను నీటిలో మరిగించి తీసుకున్నా పర్లేదు. కానీ మిల్క్​ టీ కంటే నేరుగా పెట్టుకునే అల్లంటీ తోనే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని, దగ్గు జలుబు ఉన్నప్పుడు ప్రతిరోజు రెండు కప్పులు తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు..

చలికాలంలో చికెన్​ సూప్​ని వేడివేడిగా తాగితే చాలా మంచిగా ఉంటుందట. చలి దూరమవుతుందట. అలాగే దానిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు మిమ్మల్ని వెచ్చగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయట. శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుతాయట. జలుబు సమయంలో ముక్కు దిబ్బడ ఉంటే అది కూడా దూరమైపోతుందని నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా శీతాకాలంలో తీసుకోవాల్సిన డ్రింక్స్ లో పాలు పసుపు కలిపిన డ్రింక్ కూడా ఒకటి. దగ్గు, జలుబు సమస్యలు దూరం అవ్వాలి అంటే పాలలో పసుపు వేసుకుని తాగాలని చెబుతున్నారు. రుచి కోసం తేనెను వేసుకోవచ్చట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cough
  • Could
  • health tips
  • Natural Immunity Boosters

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd