Mosquito Coils: దోమలు ఎక్కువగా ఉన్నాయని కాయిల్స్ వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
దోమల బెడద ఎక్కువగా ఉందా. దోమలు చనిపోవాలని కాయల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న వారు ఈ విషయం తెలుసుకోవాల్సిందే అంటున్నారు.
- By Anshu Published Date - 10:34 AM, Thu - 9 January 25

ఉదయం అలాగే సాయంత్రం అయితే చాలు దోమలు ఇంట్లోకి ఎగబడుతూ వస్తూ ఉంటాయి. కొంచెం గ్యాప్ దొరికినా కూడా కుప్పలు కుప్పలుగా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఇంట్లోకి వచ్చాయి అంటే రాత్రిళ్ళు పడుకున్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెవుల దగ్గర అరుస్తూ మనుషులకు కోపం తెప్పిస్తూ ఉంటాయి. ఈ దోమల నుంచి విముక్తి పొందడం కోసం ఆల్ అవుట్,గుడ్ నైట్ వంటి వాడడంతో పాటు కాయిల్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ధూపం కూడా వేస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ బ్యాట్ తో దోమల్ని చంపుతూ ఉంటారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా దోమలు మాత్రం చావవు. అయితే చాలామంది ఎక్కువగా ఈ కాయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. కాగా మస్కిట్ కాయిల్స్ లో హానికర కెమికల్స్ ఉంటాయి. వీటి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల అది శ్వాస వ్యవస్థ పై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందట. ఈ పొగను పీల్చితే శ్వాస సమస్యలు వస్తాయట. అలాగే ఆస్తమా దగ్గు వంటివి వేధిస్తాయని చెబుతున్నారు. ఈ పొగని పీలిస్తే ఊపిరి ఆడదట. కాబట్టి, వీటిని వాడకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందికి ఈ పొగ అంటే అస్సలు పడదు. ఈ పొగ పీల్చారు అంటే తలనొప్పి,మైకం,వికారం, చర్మంపై దద్దుర్లు,కంటి సమస్యలు అలర్జీలు వంటివి వస్తూ ఉంటాయి. అయితే సెన్సెటీవ్ స్కిన్ వారికి ఇది అస్సలు మంచిది కాదు.
ఈ కాయిల్స్ లో కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు ఉంటాయి. ఇవి రక్తంలో కరిగి గుండెకి చేరతాయి. దీని వల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయట. అవి ప్రాణాంతకంగా మారతాయని చెబుతున్నారు. ఈ పొగని ఎక్కువగా పీలిస్తే చాలా సమస్యలు వస్తాయట. అంతేకాదు ఈ పొగను మన ఇళ్ళలో ఉన్న బట్టలు ఇతర వాటికి కూడా చాలా త్వరగా వ్యాపిస్తాయట. ఈ పొగ సిగరెట్ పొగతో సమానం. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగను పీలిస్తే బ్రెయిన్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బ్రెయిన్ పనితీరు దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ పొగ మనం పీల్చే గాలిని కూడా కలుషితం చేస్తుందట. కాగా దోమలు తరిమేందుకు కాయిల్స్ వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు.