Mango: రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినాలి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో మామిడిపండు లభిస్తూ ఉంటాయి. ఈ మామిడి పండ్లను చిన్న పిల్ల
- By Anshu Published Date - 12:41 PM, Fri - 21 June 24

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో మామిడిపండు లభిస్తూ ఉంటాయి. ఈ మామిడి పండ్లను చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ మామిడి పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. వేసవికాలంలో లభించే ఈ మామిడి పండ్లు శరీరం డీ హైడ్రేషన్ కు గురవకుండా వేసవిలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతాయి.
అయితే మామిడి పండ్లు మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. ఎక్కువగా తింటే శరీరానికి హాని కలుగుతుంది. మామిడిపండును ఎక్కువగా తింటే విరేచనాలు, కడుపునొప్పి, అల్సర్లు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. వీటిని పురుగు మందులు వేసి కృత్రిమంగా పండిస్తారు. ఈ కారణంగా కనీసం 2 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి. మామిడిలో ఫ్రక్టోజ్ అనే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. కొంత మందికి మామిడి పండ్లు తినడం వల్ల ఎలర్జీ, గొంతు వాయడం జరుగుతూ ఉంటుంది.
అందరూ వీటిని తిని జీర్ణం చేసుకోలేరు. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ మామిడిపండును తినకపోవడమే మంచిది. ప్రస్తుతం మామిడి పండ్లను పండించడానికి రసాయనాలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. వాటిని పండించడానికి చెట్లకు కూడా క్రిమి సంహారక మందులను వాడుతున్నారు. దీనివల్ల చక్కెర స్థాయిలో పెరుగుదల ఉండటంతో పాటు ట్రైగ్లిజరైడ్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడుతుంది. మామిడిపండ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ మితంగా తినాలి. రోజు మొత్తంమీద ఒక కాయను తినేబదులు ఆ కాయను రెండు భాగాలుగా చేసి రెండుసార్లు తినడం మంచిది. మామిడి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి మామిడి పండ్లు తినాలి అనుకున్న వారు రోజుకు ఒక కాయను రెండుసార్లు తినడం మంచిది.