Maha Shivaratri: మహా శివరాత్రి రోజున ఉపవాస సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదో మీకు తెలుసా?
మహాశివరాత్రి పండుగ రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 09-02-2025 - 12:04 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ 26, ఫిబ్రవరి 2025, బుధవారం 11:08కి మొదలై 27, ఫిబ్రవరి 2025, గురువారం 08:54 వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 27న మహాశివరాత్రి పండుగను జరుపుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇకపోతే శివరాత్రి రోజున చేసే జాగారానికి, ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉందన్న విషయం తెలిసిందే. మాఘ స్నానం ఆచరించడంతోపాటు పరమేశ్వరుడికి ఉపవాసం కూడా ఉంటారు. ఈ ఉపవాస సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు అన్న విషయం చాలా మందికి తెలియదు.
మరి ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా ప్రజలు ఉపవాస సమయంలో కేవలం పండ్లు మాత్రమే తింటారు. అలాగే నీరు లేదా పాలు కూడా తాగుతారు. కొందరు ఆహారం లేదా పానీయాలకు దూరంగా ఉంటారు. నీళ్లు కూడా తాగకుండా పస్తులు ఉంటారు. మహా శివరాత్రి వ్రతాన్ని అత్యంత శ్రద్ధతో పాటిస్తారు. శివరాత్రి రోజున చేసే ఉపవాసం, రాత్రి జాగరణను అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తే శివుడు భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్మకం. పాలు, ఆకులు, పండ్లు సమర్పించడానికి సమీపం లోని శివాలయాన్ని సందర్శించి శివరాత్రిని ప్రారంభమవుతుంది.
ఉపవాస సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయానికి వస్తే.. పప్పులు, ఉప్పు, గోధుమ , బియ్యం వంటి తృణధాన్యాలకు దూరంగా ఉండాలట. ఉడికించిన చిలగడ దుంపలు, పండ్లు వంటి ఆహారా పదార్ధాలను తినవచ్చట. చిలకడదుంపల లోకి పసుపు వెల్లుల్లి,ఉల్లిపాయలు, వేసి ఉడికించవద్దు. ఒకవేళ శివ రాత్రి సమయంలో తినే ఆహారంలో ఉప్పు ఉపయోగించాల్సి వస్తే రాతి ఉప్పుని మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం రోజున పండ్లు, పాలు, నీరు తీసుకోవాలట. శివరాత్రి రోజు సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం జావా వంటి ఫుడ్ ఐటమ్స్ అల్పాహారంగా చేసుకోవాలని చెబుతున్నారు.