Lychee: వేసవికాలంలో తప్పకుండా ఈ పండు తినాల్సిందే.. ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి!
వేసవిలో చాలా రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే పండు తినాలని, ఒకవేళ ఎక్కడైనా కనిపించినా అసలు వదలకండి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Sat - 26 April 25

ఎండాకాలంలో చాలా రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో లిచీ పండ్లు కూడా ఒకటి. ఈ పండ్లు చూడటానికి మాత్రమే కాదు తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా తక్కువ మంది మాత్రమే తింటూ ఉంటారు. పైన ఎరుపు రంగులో ఉండి లోపల గుజ్జు తెల్లటి రంగులో ఉంటుంది. అదేవిధంగా తెల్లటి గుజ్జులో చిన్న కాఫీ గింజ లాంటి విత్తనం ఒకటి ఉంటుంది. లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్స్, ఖనిజాలకి గొప్ప మూలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా వేసవిలో నీటిశాతం అధికంగా ఉండి, జ్యూసీగా ఉండే లిచీ తినడం మంచిదని చెబుతున్నారు.
ఈ పండు ఎంత రుచికరమైనదో అంతే ఔషధ గుణాలతో నిండి ఉంటుందని చెబుతున్నారు. వేసవిలో వచ్చే చాలా రకాల పండ్లలో లిచీ కూడా ఒకటి. అధిక నీరు, జ్యూస్ ఎక్కువగా ఉండే లిచీ పండ్లను తినడం వల్ల శరీరం చల్లబడుతుందట. ఇది జీవక్రియను బలపరుస్తుందట. ఇది త్వరగా పొట్ట నిండుగా ఉండేలా చేస్తుందని, ఫలితంగా బరువును తగ్గిస్తుందని చెబుతున్నారు. లిచీలో విటమిన్ సి అధికంగా ఉంటుందట. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. లిచీలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. లిచీలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుందట. ఇకపోతే లిచీ తక్కువ కేలరీలు కలిగిన పండు అన్న విషయం తెలిసిందే.
దీంతో ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందట. అంతేకాకుండా లిచీ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయట. నరాల సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయట. గుండెను ఆరోగ్యం ఉంచేందుకు అవసరమైన పాలిపినాల్స్ లిచీలో అధికంగా ఉన్నాయి. పాలిపినాల్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయట. ఈ పండ్లను తరచూ తినటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య ఉండదని చెబుతున్నారు. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరిచేందుకు లిచీ సహకరిస్తుందట. శరీరంలోని బాక్టీరియాలు, వైరస్ లను నానశనం చేస్తుందట. లిచీలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందట. వీటిని ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పచ్చిగా ఉండే లిచీ పండ్ల జోలికి అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.