Ladies Finger: బెండకాయ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఆశ్చర్యపోవాల్సిందే?
- Author : Sailaja Reddy
Date : 08-04-2024 - 8:03 IST
Published By : Hashtagu Telugu Desk
మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు బెండకాయను ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇక బెండకాయతో మనం ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూనే ఉంటాం. ఈ బెండకాయలు మనకు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో విరివిగా లభిస్తూ ఉంటాయి. బెండకాయ తింటే మధుమేహం అదుపులో ఉండటంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బెండ కాయలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
We’re now on WhatsApp. Click to Join
కాగా బెండకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. బెండకాయలో ఉండే గ్లైసెమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయలో ఉండే ప్రొటీన్ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొటీన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. తగినంత ప్రొటీన్ తీసుకుంటే అది దీర్ఘకాలం మధుమేహ నియంత్రణకు ఉపకరిస్తుంది. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉండటం వల్ల డయాబెటిస్, క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. బెండకాయలో ఉన్న పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. బెండకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
Also Read: Summer Skin Care Tips : సమ్మర్ స్కిన్ కేర్.. హెల్తీ అండ్ బ్యూటీ కోసం కొన్ని చిట్కాలు..!
పీచు ఎక్కువగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలితో ఉంచుతుంది. అలాగే బెండకాయలో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బెండకాయలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెండకాయలో ఉండే బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బెండకాయలో ఉండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
Also Read: Beer: సమ్మర్ లో బీరు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?