Sleep And Pillow: దిండు లేకుండా నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
సాధారణంగా చాలామందికీ పడుకునే టప్పుడు తల కింద దిండు పెట్టుకోవడం అలవాటు. కొంతమందికీ అయితే తల
- Author : Anshu
Date : 20-09-2022 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా చాలామందికీ పడుకునే టప్పుడు తల కింద దిండు పెట్టుకోవడం అలవాటు. కొంతమందికీ అయితే తల కింద దిండు లేకపోతే నిద్ర కూడా సరిగా పట్టదు. ఇంకొంత మందికి తల దిండు లేకుండా నిద్ర పోవడం ఇష్టం. అయితే నిద్ర పోయే టప్పుడు తల దిండు లేకుండా నిద్ర పోతే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిద్రపోతున్నప్పుడు మన తల తటస్థ స్థితిలో ఉండాలి. తల పూర్తిగా భూజాల పై ఉంటుంది. మరీ వెనకకు వంగదు, ముందుకు ఉండదు. దీనివల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మీరు దిండును వాడాలి, వాడకూడదు అనేది మీరు నిద్రపోయే పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవైపుకు తిరిగి నిద్రపోవడం, లేదా స్టైట్‌గా నిద్రపోయే అలవాటు ఉన్నవారు దిండు వేసుకోవడం మంచిది. ఒకవేళ బోర్లా పడుకునే అలవాటు ఉంటే కనుక దిండు వేసుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలా బోర్లా పడుకునే వారు పలుచగా ఉండే దిండు వేసుకున్నా మంచిదే. బ్రోర్లా పడుకునే వారు దిండు లేకుండా నిద్రపోతే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగె తలగడ లేకుండా నిద్రపోతే వెన్నెముక నిటారుగా ఉండి వెన్ను, మొడ నొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంది. మీకు దిండు లేకుండా నిద్రపోయే అలవాటు లేకపోతే పలుచని దిండు ఉపయోగిస్తే మీకు రిజల్ట్ ఉంటుంది.
బోర్లా పడుకునే అలవాటు ఉన్నవారు దిండు వాడితే, చర్మాన్ని కదించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఇవి, ముడతలకు దారి తీసి చిన్న వయసులోనే ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయట. దిండు లేకుండా నిద్రపోతే ముడతల సమస్య దూరం అయ్యి యంగ్ గా కనిపిస్తారు. ఒకవేళ ఎత్తు ఉన్నవారు. దిండు పై పడుకుంటే, మీ మెడ కాలక్రమేణా వంగే ప్రమాదం ఉంది. దిండు లేకుండా నిద్రపోతే నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే తలగడ లేకుండా నిద్రపోయవడానికి ప్రయత్నించండి. అందువల్ల బాగా నిద్ర పడుతుంది.