Ghee Benefits: మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదో కాదో.. ఇలా చెక్ చేసుకోండి?
హిందువులు నెయ్యిని చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ నెయ్యిని తినడానికి, అలాగే పూజ చేయడానికి కూడా
- By Nakshatra Published Date - 09:38 AM, Fri - 19 August 22
హిందువులు నెయ్యిని చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ నెయ్యిని తినడానికి, అలాగే పూజ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే శాఖాహారులు నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే హిందువులు స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయడం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన నెయ్యితో దేవుడికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు. కాగా భారతదేశంలో ఈ నెయ్యి ని ఉపయోగించి నైవేద్యాన్ని సమర్పించడం అన్నది అనాది కాలంగా వస్తోంది. ఇకపోతే ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన నెయ్యి అంటే మన ఇంట్లో చేతితో తయారు చేసుకున్న నెయ్యి అని చెప్పవచ్చు.
కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో నెయ్యి చేసుకోవడానికి సమయం లేక మార్కెట్లో దొరికే పలు నెయ్యి ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో దొరికే నెయ్యి అంతా కూడా కల్తీది. అయితే మరి మనం వాడుతున్న నెయ్యి కల్తీనా లేక స్వచ్ఛమైనదా అన్నది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కల్తీ నెయ్యిని ఉపయోగించాము అంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే అని చెప్పవచ్చు. మరి కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వడం వల్ల నకిలీ నెయ్యిని గుర్తు పట్టవచ్చు. అసలైన నెయ్యిని గుర్తించేందుకు అందులో 4 లేదా 5 చుక్కలు అయొడిన్ వేయండి.
అది నీలి రంగులోకి మారితే నకిలీదని అర్ధం. నెయ్యికి ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం వలన ఈ రంగు వస్తుంది. అలాగే కల్తీ నెయ్యిని పసిగట్టేందుకు ఒక స్పూన్ నెయ్యిలో కొంచెం చక్కెర వేసి దానికి హైడ్రాక్లోరిక్ ఆమ్లాన్ని కొద్దిగా కలపినప్పుడు అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ నెయ్యి అని గ్రహించాలి. అలాగే నెయ్యి నాణ్యత సింపుల్గా గుర్తించేందుకు ఇంకో చక్కటి చిట్కా.. మన చేతిలో కాస్త నెయ్యి వేసి రెండు చేతితో బాగా రుద్దాలి. కాసేపయ్యాక నెయ్యి వాసన రాదు. నాణ్యమైన నెయ్యి ఎప్పుడూ సువాసనతో ఉంటుంది. ఇలా రుద్దిన వెంటనే వాసనపోదు. వాసనపోయిదంటే అది కల్తీ నెయ్యే అని తెలుసుకోండి. అలాగే స్వచ్ఛమైన నెయ్యి తెల్లగా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. పూసపూసలా కనిపిస్తుంది. వేడి చేసినప్పుడు మాత్రమే నూనెలా కనిపిస్తుంది. అదే కల్తీ నెయ్యికి ఇలా ఉండదు.
Related News
Banana With Ghee: నెయ్యి అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
నెయ్యి,అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండింటిని కొంచెం పంచామృతంలో వినియోగిస్తూ ఉంటారు. చాలామంది ఈ రెండింటిని తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. రెండింటిలోనూ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అరటిపండులో విటమిన్ సి, బి-6, యాంటీ ఆక్సిడెంట్లు, పొట�