Jeera Water: జీలకర్ర నీటిలో సబ్జా గింజలు వేసుకొని తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
జీలకర్ర వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. జీలకర్ర నీటిలో సబ్జా గింజలు కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 22-05-2025 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
మాములుగా ఉదయం నిద్ర లేవగానే చాలా మందికి కాఫీ, టీ, గ్రీన్ టీ వంటివి తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది వీటికి బదులు జీలకర్ర నీరు, సబ్జా నీరు, లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగారా, జీలకర్ర నీటిలో సబ్జా గింజలు కలుపుకొని తాగారా, ఇలా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జీలకర్ర, సబ్జా గింజలు జీర్ణక్రియకు సంబంధించిన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయట. కాబట్టి ఖాళీ కడుపుతో సబ్జా గింజలు కలిపిన జీలకర్ర నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుందట.
అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. ముఖ్యంగా మలబద్ధకం సమస్యను నివారించి, ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి సబ్జా గింజలు కలిపిన జీలకర్ర నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుందట. సబ్జా గింజలు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయట. జీలకర్ర నీరు జీవక్రియను పెంచి శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని,కాబట్టి ఈ రెండు బరువు తగ్గడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీరు, సబ్జా గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యానికి చాలా మంచిదట. సబ్జా కలిపిన జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో తాగితే వాపును తగ్గిస్తుందని, మొటిమలను నివారిస్తుందని చెబుతున్నారు.
చర్మాన్ని స్పష్టంగా, ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుందట. జీలకర్ర, సబ్జా గింజలలో ఉండే గుణాలు చర్మ సమస్యలను కలిగించే విషాన్ని తొలగించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే సబ్జా గింజలు కలిపిన జీలకర్ర నీటిని ఖాళీ కడుపుతో తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. కాబట్టి ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందని,అంటు వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందని చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో సబ్జా గింజలు కలిపిన జీలకర్ర నీటిని తాగితే శరీరంలోని విషాన్ని బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుందట. సబ్జా, జీలకర్ర నీరు సహజంగానే శరీరాన్ని శుభ్రపరుస్తాయని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.